ఉరిమి ఉరిమి మంగలం మీద పడిందన్నది సామెత. తెల్లారి లేస్తే, ఈ రోజు జగన్ ను ఏ విదంగా విమర్శిద్దామా అన్న యావ తెలుగుదేశం నేతలది. అందుకు పేపర్లు తిరగేస్తుంటారు.జరిగిన సంఘటలను గుర్తు చేసుకుంటారు. దీనివల్ల మూడు ఉపయోగాలు. ఒకటి జగన్ పై ఓ రాయేసాం. రెండవది జగన్ ఎన్ని మాటలంటే చంద్రబాబు అంత ఆనందిస్తారు. ఇక ముఖ్యంగా మూడవది. గల్లీ స్థాయి లేదా ఏ స్థాయి లేని నాయకుడు అయినా జగన్ ను విమర్ళిస్తే చాలు 'పచ్చ'పాత పత్రికలు పతాక శీర్షికల్లొ ప్రచురిస్తాయి. దాంతో పెద్ద లీడరైపోవచ్చు. ఇంతకీ తాజా సంగతి ఏమిటంటే, హరీష్ రావును, కెసిఆర్ ను తెలంగాణ ప్రచారంలో నానా మాటలు అంటున్నవాడు పవన్ కళ్యాణ్. దాంతో వారి అభిమానికో మరొకరికో కోపం వచ్చింది. కోర్టు కెక్కారు. దాంతో కేసు నమోదు చేయమని ఆదేశం వచ్చింది. అంతవరకు బాగానే వుంది. కానీ కొత్తగా జ్యోతిష్యం చెప్పడం నేర్చుకున్న యనమల ఈ కేసు జగన్ కుట్ర అని కనిపెట్టేసారు. పవన్ కళ్యాణ్ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టే, ఇలా కేసు పెట్టించారన్నది ఆయన భవిష్యత్ దర్శనం. ఎవరో ఎవర్నో అంటే, వేరెవరో కేసు పెడితే, ఇంకెవరి మీదకో నెట్టడం అంటే ఏమనుకోవాలి. దగుల్బాజీ రాజకీయం అనుకోవాలి. అంతే కదా? 

మరింత సమాచారం తెలుసుకోండి: