ప్రతి జీవితం ఓ అంతులేని సముద్రం అడుగడుగునా నా భారతంలో దరిద్రం రచనలకు అందనిది మన చరితం కాని ఈనాడు ఎగురుతోంది హింసాకపోతం కారణమేదైనా నలుగుతోంది జనజీవనం కారకులెవరైనా మారుతోంది మన పయనం నీరులేక కన్నీటితో నిండుతోంది ప్రతి నయనం అయినా కరగని శిలలా మిగిలిచూస్తోంది ఆ గగనం ఆత్మాహుతులతో వెలుగుతోంది భారతం ఈ భూమిపై వివరించలేని ఘోరాలు అనంతం ఇలపై శాంతి అవుతోంది ఈనాడు అంతం అలంకరించుకుంటోంది ఈనాడు అహింస అజ్ఞాతం

మరింత సమాచారం తెలుసుకోండి: