చల్లని వాతావరణంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. ప్రతి ఒక్కరి అడుగులు, తాము తడవకుండా దాక్కునేలా దారి తీస్తున్నాయి. వరుణుడి ప్రవాహం అందంగానూ, జనరంజకంగానూ కొనసాగుతుంది. అందంగా సాగుతున్న ఆ వర్షంలో ఒక అందమైన రూపం ఇంకా అందంగా నవ్వింది. వరుణుడు సైతం ఆగిపోయి అలా చూస్తున్నాడు, తనకన్నా అందంగా కురుస్తున్న ఆ వెన్నెల వర్షాన్ని. ప్రకృతిసైతం ఆశ్చర్యపోయి చూస్తుంది తనకన్నా సుందరంగా ఆకృతి దాల్చుకున్న ఆ రూపాన్ని. సూర్యుడుసైతం సిగ్గుపడి చూస్తున్నాడు తనకన్నా దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ మనోహర వదనాన్ని భూమిసైతం గర్వంగా చూస్తుంది తనకన్నా కీర్తి గడిస్తున్న ఆ తేజోభరితమైన అందాన్ని జనజీవనం మొత్తం తడుస్తూ చూస్తోంది తమకన్నా అందంగా తడుస్తున్న ఆ నా స్వర్గలోకపు ప్రేమదేవతని

మరింత సమాచారం తెలుసుకోండి: