గ్రహాంతర వాసులు ఉన్నారా... మానవాళిలో శతాబ్దాల తరబడి ఆసక్తిరేకిత్తిస్తున్న ప్రశ్న ఇది. వాస్తవానికి ఈ విశాల విశ్వంలో మనం చూసింది కేవలం.. భూమి, చంద్రుడు మాత్రమే.. ఇప్పుడిప్పుడే శుక్రుడు, అంగారకుడి పైకి ప్రత్యేక యంత్రాలను పంపి.. అక్కడి విశేషాలు తెలుసుకుంటున్నాం. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నవ గ్రహాల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. అంటే మనకు విశాల విశ్వంలో ఉన్న ఒక నక్షత్తమైన సూర్యుడు చుట్టూ ఉన్న తొమ్మిది గ్రహాల గురించి కూడా పూర్తిగా తెలియదన్నమాట. మరి సూర్యుడు లాంటి నక్షత్రాలు.. అనంత విశ్వంలో లక్షలు.. కోట్లు.. మరి వాటిలో భూమి వంటి గ్రహం ఉండదని గ్యారెంటీ లేదు. మనల్ని పోలకపోయినా.. మనకంటే భిన్నమైన జీవం ఉండదని చెప్పలేం. ఈ సందేహమే.. ఎన్నో ఊహాగాలకు కారణం. ఈ గ్రహాంతరవాసుల సబ్జెక్టుపై అనేక రచనలు, హాలీవుడ్ సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి. ఇప్పుడు గ్రహాంతరవాసుల ఉనికి నిజమేననిపించే వాస్తవం ఒకటి వెలుగుచూసింది. నవగ్రహాల్లో చివరిదైన ప్లూటో గ్రహంపై సముద్రం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. నాసా లేటెస్ట్ గా తీసిన ఫోటోలతో ఈ విషయం వెలుగు చూసింది. వాస్తవానికి ఫ్లూటో ఓ మంచు ఖండం... ఫ్లూటోపై ఉష్ణోగ్రత మైనస్ 229 డిగ్రీల సెంటిగ్రేడ్.. ఈ ఉష్ణోగ్రత దగ్గర మంచు నీరుగా మారే అవకాశమే లేదు. కానీ.. ఈ మంచు పలకల అడుగున సముద్రం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పలకలు...ఫ్లూటో ఉపరితంలో చీలికలు వస్తే.. ఈ నీరు బయటపడే అవకాశం ఉందట. జీవి ఉద్భవించడానికి జలానికి మించిన అనుకూల వాతావరణం మరొకటి లేదన్న సంగతి తెలిసిందే. అసలు భూమిపై జీవి పుట్టింది కూడా బురద నుంచే అన్న సంగతి తెలిసిందే. మరి ఆ విధంగా చూస్తే.. ఫ్లూటోపై జీవం ఉండే అవకాశాలే ఎక్కువన్నమాట. నవ గ్రహాల్లో చివరిదైన ఫ్లూటో ఉనికి ఆసక్తి గొలిపినా.. దాని గురించి పరిశోధన సాగించడం అంత సులభమేంకాదు.. ఎందుకంటే.. అది సూర్యుడి నుంచి 590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి భూమి నుంచి వెళ్లిన ఏ వస్తువూ.. ఇప్పటికి చేరలేదు. ఈ ఫ్లూటోకి కూడా మన భూమికి ఉన్నట్టు ఓ చందమామ ఉంది. దాని పేరు చరాన్. మరి ఈ గ్రహం గురించి తెలిసే దారే లేదా.. అంటే ఉంది. అదే న్యూ హోరైజాన్స్ వ్యోమనౌక. దీన్ని నాసా 2006లో ప్రయోగించింది. అంటే 8 సంవత్సరాల క్రితం అన్నమాట. అప్పటి నుంచి శరవేగంతో వెళ్తున్న ఈ వ్యోమనౌక వచ్చే ఏడాది జూలైలో ఫ్లూటో మీదకు వెళ్తుంది. న్యూ హోరైజాన్స్ వ్యోమనౌక అందించే సమాచారం కోసం ఇప్పుడు నాసాతో పాటు.. ప్రపంచంలోని ఖగోళ శాస్త్రవేత్తలంతా ఎదురుచూస్తున్నారన్నమాట. ఈ వ్యోమనౌక ఇంకా ఫ్లూటోను చేరక ముందే కొన్ని ఫోటోలను పంపింది.. ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్న అంశాలకు ఈ ఫోటోలే ఆధారం. హోరైజాన్స్ పంపుతున్న ఫోటోల ఆధారంగా నాసా సైంటిస్టులు కొన్ని అంచనాలకు వచ్చారు. వాటిలో ఎంత వాస్తవం ఉంది... అన్నదానిపై వచ్చే ఏడాది కానీ పూర్తి క్లారిటీ రాదన్నమాట..

మరింత సమాచారం తెలుసుకోండి: