కిడ్నాపింగ్ లు, బెదిరింపులు, ప్రలోభాలు, జంపింగ్ లకు పరాకాష్టగా జరిగిన ఎంపీపీ, జడ్పీ ఎన్నికల్లో తెలుగుదేశం తన సత్తాను చాటింది. వైకాపా గుర్తు మీద గెలిచిన అనేక మంది ఎంపీటీసీ సభ్యులను, జడ్పీటీసీలను తెలుగుదేశం తనవైపుకు తిప్పుకొంది. వైకాపాకు బలం ఉన్న మండలాల్లోనూ, జిల్లాల్లోనూ పచ్చ జెండాను ఎగరేసే ప్రయత్నం చేసింది. మరి ఇలాంటి తతంగంలో తెలుగుదేశం తరపున నేతలు చాలా యాక్టివ్ గా పనిచేశారు. తరతమ బేధాలు మరిచి అందరూ కలిసి బలవంతంగానైనా తమ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇలాంటి ప్రయత్నాలు తీవ్రస్థాయిలో జరిగిన జిల్లాల్లో ఒకటి అనంతపురం జిల్లా. ఇక్కడ అయితే ఒక్క మండలాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడలేదు తెలుగుదేశం నేతలు. తమకు ఏ మాత్రం బలం లేని చోట కూడా వైకాపా వాళ్లను తనవైపుకు తిప్పుకొని గెలవడమే పరమావధిగా పనిచేసింది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఇది వరకూ అనంతపురంలో తెలుగుదేశం తరపున రౌడీయిజం చేయాలంటే అది ఒకరి బాధ్యతగానే ఉండింది. పదేళ్ల కిందటి వరకూ పరిటాల రవి జోక్యం చేసుకొంటూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బతికించుకొనే వాడు. కాంగ్రెస్ వాళ్ల నామినేషన్లను ఉపసంహరింపజేయడం, ఎంపీటీసీ అభ్యర్థులను కిడ్నాప్ లు చేయడం, బెదిరించడం వంటి వ్యవహారాలతో రవి సునాయాసంగా తెలుగుదేశం జెండాను ఎగరేసేవాడు. మరి ఈ సారికి పరిటాల రవి వారసత్వాన్ని ఆయన కుమారుడు తీసుకొన్నాడు. స్పష్టమైన బలం ఉన్నప్పటికీ పరిటాల శ్రీరామ్ అనంతపురం జడ్పీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి చాలానే శ్రమించాడు. మరి పరిటాల వర్గం ఈ పనిలో ఉండగా... మరోవైపున దివాకర్ రెడ్డి రెచ్చిపోయాడు! ఈయన అనంతపురం లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని మండలాల బాధ్యతలను తీసుకొని ఎంపీపీలలో తెలుగుదేశం జెండాను ఎగరేయడానికి తమదైన శైలిలో ప్రయత్నాలు చేశాడు. ఈ విధంగా జిల్లాలో టీడీపీకి డబుల్ బొనాంజాగా ఇద్దరు బలవంతమైన నేతలు లభించారు!

మరింత సమాచారం తెలుసుకోండి: