తెలంగాణలో సంపూ ర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి విపక్షాలను పూర్తి స్థాయిలో బలహీనం చేయాలనే ఎత్తుగడతో ముందుకు పోతున్నట్లు సమా చారం. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ను పూర్తిస్థాయిలో అమలుచేసి మెజారిటీ మున్సిపాలిటీలు, మండల ప్రజాపరిషత్‌, జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్న తెరాస మున్సిపల్‌ కార్పోరేషన్లను సైతం అన్నింటినీ తన ఖాతాలోనే వేసుకుంది. మిగిలిన పార్టీల నుండి గెలిచిన వారిని సైతం పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసా గించాలని నిర్ణయించినట్లు సమాచారం. శాసనమం డలిలో కేవలం ఆరుగురు సభ్యుల బలం మాత్రమే కలిగి ఉన్న తెరాస వ్యూహాత్మకంగా అడుగులు వేసి మెజారిటీ సాధించగలిగింది. మండలి ఛైర్మన్‌ ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎనిమిదిమంది ఎమ్మెల్సీల ను, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఇద్దరిని తెరాసలోకి రప్పించడంలో విజయం సాధించి పార్టీ అభ్యర్ధి స్వామిగౌడ్‌ను ఎన్నికయ్యేలా చేయగలిగింది. ఇక శాసనసభలో 119 స్థానాలకుగాను 63 స్థానాలను గెలుచుకున్న తెరాస ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అనంతరం బహుజన్‌ సమాజ్‌ పార్టీ గుర్తుపై గెలిచిన ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ శాసనసభ్యుడు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్‌ నుండి గెలిచిన కోనప్పను తెరాసలో చేర్చుకుని తన బలాన్ని పెంచుకుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను సైతం పార్టీలోకి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆ ముగ్గురి రాక వాయిదా పడింది. రాజకీయ పరిణా మాల నేపధ్యంలో తెరాస సైతం కొంత పునరాలోచన లో పడి వారిని చేర్చుకోవడంలో కొంత ఆలస్యం జరిగినా ఇబ్బంది లేదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మొన్న జరిగిన జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎన్నికల్లో బద్ధశత్రువులుగా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు పరోక్షంగా అవగాహన చేసుకోవ డం, వారి ఎత్తులను చిత్తు చేయడానికి కొంత కష్టపడ డం వంటి పరిణామాలను గమనించిన తెరాస ఆ రెండు పార్టీలను బలహీనం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్యే లతో జరిపిన మంత్రాంగం ఫలించినట్లు తెలుస్తోంది. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యు నిగా పనిచేస్తున్న ఓ ఎమ్మెల్యేతో తెరాసలోని ప్రముఖ నాయకులు ముమ్మర మంత్రాం గం నెరపిన ట్లు తెలు స్తోంది. ఆ ఎమ్మెల్యే సైతం తన అంగీకారా న్ని తెలిపిన ట్లు సమా చారం. మరో సీనియర్‌ శాస నసభ్యుడు సైతం ఇదే దారి లో పయనించా లని నిర్ణయించు కున్న ట్లు తెలు స్తోంది.  ఎన్నికల కు ముందే ఈ శాసనసభ్యుడు తెరాసలో చేరాల ని నిర్ణయించు కున్నా చివరి క్షణంలో తన ఆలోచనను విరమించుకున్నట్లు వార్తలొచ్చాయి. మహబూబ్‌న గర్‌ జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే పై సైతం తెరాస వల విసిరినట్లు తెలుస్తోంది. వరంగల్‌ జిల్లాకు చెందిన తెదేపా ప్రజాప్రతినిధి సైతం తెరాస లోకి వచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన ఆర్‌. కృష్ణయ్యకు ఎన్నికల అనంతరం పార్టీలో ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయనపై కూడా తెరాస దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి బీసీ ఉద్యమాన్ని నడిపిన తాను పార్టీ మారి విశ్వసనీయతను పోగొట్టుకోలేననే అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నుండి తెరాసలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్న పార్టీ శాసనసభ్యులు ఆయన అభిప్రాయాన్ని కూడా అడిగినట్లు సమాచారం. పార్టీ బిసిలకు ప్రాధాన్యత ఇస్తే వచ్చే ఎన్నికలనాటికైనా తెలంగాణ లో బలపడుతుందని, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ బలహీనమవుతున్న పరిస్థితుల్లో తెరాసకు ప్రత్యామ్నాయంగా పార్టీకే అవకాశా లుంటాయని తొందరపడి పార్టీ మారవద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: