ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ బంగారు రుణాలను మాఫీ˜ి చేస్తున్నట్లు ప్రకటిస్తుంటే బ్యాంకర్లు మాత్రం నోటీసులు జారీ చేస్తూ రైతన్న మెడకు ఉచ్చు బిగిస్తున్నారు. మాఫీ గీఫీ జాన్తా నై... వారంలో రుణాలు కట్టాల్సిందే నంటూ నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తూ బ్యాంకర్లు ఔరా అనిపించుకుంటున్నారు. ఎన్నికల ముందు అధికార పార్టీ నేతలు తాము అధికారంలోకి వస్తే వెంటనే రుణాలు మాఫీ చేస్తామని గ్రామాలలో ఢంకా మ్రోగించి చెప్పారు. దీంతో అప్రమత్తమైన రైతన్నలు వివిధ బ్యాంకుల నుండి తీసుకున్న అప్పుల చెల్లింపులపై ఆసక్తి చూపలేదు. తమ అప్పులు మాఫీ˜ి అవుతాయని భావించిన రైతన్నలను వారు నమ్మి అధికారాన్ని అప్పగించిన పార్టీలే నట్టనడివీధుల పాల్జేయడంతో నిలువునా మునిగిపోయారు. అసంబద్ధ అస్పష్ట ప్రకటనలతో ప్రభుత్వం చేస్తున్న కాలయాపన చివరకు రైతన్న మెడకు ఉరితాడుగా మారింది.  రుణామాఫికై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాంకర్లు తమ పనిని చకచక కానిస్తున్నారు. సందులో సడేమియా అన్నట్లుగా నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నారు. కేవలం అక్షలోపు రుణాలనే మాఫీ చేస్తామంటూ తేల్చి చెప్పిన కెసిఆర్‌ సర్కార్‌, ప్రజలూ ప్రతిపక్షలూ ఆందోళన చేయడంతో బంగారు తాకట్టుపై తీసుకున్న రుణాలను కూడా మాఫి చేస్తామంటూ తమ ప్రకటనను సవరించుకున్నారు. వ్యవసాయ రుణాలతో పాటు బంగారు తాకట్టుపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని ఇటివల రాష్ట్ర ముఖమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు కూడా. పాక్షాత్తు ముఖ్యమంత్రి మాటను సైతం ఖాతరు చెయ్యకుండా బ్యాంకర్లు ఒక అడుగు ముందుకేసి బక్కచిక్కిపోయిన రైతుకు నోటీసులు జారీ చేసి వేధిస్తున్నారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మండల పరిధి వీర్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ది కోపరేటివ్‌ బ్యాంకులో బంగారు తాకట్టుపెట్టి రుణాలు పొందారు. ప్రభుత్వ ప్రకటను చూసిన ఆ రైతులు బంగారు రుణాలు ఎలాగైనా మాఫీ˜ి అవుతాయి కదా అని రుణాలు కట్టలేదు. వీరేశెట్టిపల్లి గ్రామానికి చెందిన తూర్పు రాజు తాండూరులోని ది కోపరేటివ్‌ బ్యాంకులో అకౌంట్‌ నంబర్‌ 15588పై బంగారు తాకట్టుపెట్టి రూ.46వేలు రుణంగా తీసుకున్నారు. గత నెల 9న కోపరేటివ్‌ బ్యాంకు అధికారులు 'వారం రోజులలో తీసుకున్న రుణాన్ని చెల్లించాలని కోరుతూ' నోటీసును జారీ చేశారు. ఆయనతో పాటు గ్రామంలోని మరి కొందరు రైతులకు ఇలాంటి నోటీసులు అందడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం పంటలు సక్రమంగా పండక అప్పుల పాలైన రైతన్నను ఈ ఖరీఫ్‌ నట్టేట మంచడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత మాసంలో తాండూరు మండల పరిధి సిరిగిపేట్‌ గ్రామంలో ఓ రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: