ఒకప్పుడు బిజెపి ఎంపిగా ఉన్న హైదరాబాద్ టైగర్ ఆలే నరేంద్ర హయాంలో కేసిఆర్ బిజెపితో జతకట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ ఇపడు ఆ పరిస్థితులు గోచరిస్తున్నాయా? బిజెపి రాష్ర్ట అధ్యక్షుని వ్యాఖ్యలతో ఆశలు చిగురిస్తున్నాయా? అంటే ప్రస్తుత ఇరు పార్టీల కార్యకర్తలు అవుననే అంటున్నారు. ఇందుకు ఉదాహరణే జాతీయ మీడియాతో బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ అభివృద్దికి తన ప్రాంతం పరంగా మోడీ ప్రభుత్వాన్ని కోరతామని, అందుకు కేసిఆర్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని పేర్కొనడం చర్చనీయాంశమైంది. అప్పట్లో ఏపి ఆలే నరేంద్ర వహించిన పాత్రనే ప్రస్తుతం కిషన్‌రెడ్డి తీసుకున్నారా? అనే సందేశాలు ఆయన చేసే వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అటు రాష్ట్రానికి, ఇటు కేంద్రానికి వారధులుగా ఉంటామని చెబుతూనే తెలంగాణలో పార్టీ పటిష్టతపై బిజెపి అధ్యక్షులు దృష్టిసారించడం విశేషం. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధికి మోడీ ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటామని చెబుతున్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను చాలా లోతుగా పరిశీలించాల్సి ఉందని, మేథావి వర్గం పేర్కొంటోంది. కేంద్రం నుండి అవసరమైన సాయం పొందాలంటే ఇక్కడి రాష్ర్టంలో ఉన్న ప్రభుత్వంతో దోస్తీ కట్టాలి. మరోవైపు ఈ తరుణంలోనే ఇక్కడి ప్రభుత్వానికి ఖచ్చితంగా కేంద్రం సాయం అవసరం. వీటన్నింటిని అన్వయించేందుకు గాను, తన పరంగా కిషన్‌రెడ్డి ముందుకు వచ్చినట్లు మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన వ్యవహరశైలే స్పష్టంచేస్తోంది. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాష్ర్ట సమస్యలను కేంద్రానికి విన్నవించడంలో కూడా అరుదైన చాణిక్య నీతిని కిషన్‌రెడ్డి ప్రదర్శించారని రాజకీ విశ్లేషకులు భావిస్తున్నారు. విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టం సమస్యలతో కొట్టుమిట్టాడు తోందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహాయసాకారాలు కావాలంటూనే.. ఇక్కడి ప్రభుత్వంతో మైత్రి చేసుకోవడానికి కిషన్‌రెడ్డి తనదైన శైలిలో రచనలు చేస్తున్నారు. ఇందుకు ఇక్కడి బిజెపినేతల అండ వల్లే ఇదంతా జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: