తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం కోసం కార్పోరేట్ సంస్థల నిర్వహణలో తలపండిన రతన్ టాటా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నారాయణ మూర్తి వంటి వారి సలహాలను తీసుకోవాల్సిందిగా అధికారులను నిర్దేశించారు. కెసిఆర్ దేశానికి ఆర్ధిక రాజధాని అయిన ముంబై మరియు రాజధాని నగరమైన ఢిల్లీలలో సెమినార్లు నిర్వహించి తెలంగాణ ప్రారిశ్రామిక విధానంపై ఆ రంగంలో దిగ్గజాలైన ప్రముఖుల సలహాలను స్వీకరించాల్సిందిగా అధికారులకు సూచించారు. టాటా,అంబానీల నుండి సలహాలు స్వీకరించనున్న కెసిఆర్తెలంగాణలో నెల రోజులలోపు పారిశ్రామిక విధానాన్ని అమలు పరిచి జాతీయ, అంతర్జాతీయ బడా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే విధంగా ఆకర్షించే ప్రయత్నాలను కెసిఆర్ చేస్తున్నారని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఆఫీసుల్లో కుర్చుని గుజరాత్ వంటి పక్క రాష్ట్రాల నమూనాను కాపీ కొట్టకుండా స్వయంగా పరిశ్రమల యాజమాన్యంతో కలిసి మాట్లాడి వాటి పోర్ట్ ఫోలియోను తెలుసుకోవాలని కెసిఆర్ అభిప్రాయపడుతున్నట్టుగా సమాచారం. ఇక తెలంగాణలో అధిక ఖనిజ సంపద ఉన్నందున పారిశ్రామిక విధానం ప్రవేశ పెట్టడంద్వారా విశేష అభివృద్ధిని సాధించవచ్చునని కెసిఆర్ నమ్మకంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: