కోమటిరెడ్డి సోదరులు వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకునే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీ యంగా తెలిసింది. టిఆర్‌ఎస్‌లో చేరేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని, సోదరుడు రాజగోపాల్‌కు మెదక్‌ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో సీటివ్వా లని, తనకు మంత్రిమండలిలో బెర్త్‌ ఖాయం చేయాలని వెంకట్‌రెడ్డి కోరుతు న్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకుల ద్వారా సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ నియోజకవర్గం నుంచి వెంకట్‌ రెడ్డి ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక కాగా, ఆయన తమ్ముడు రాజగోపాల్‌ భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశానని, కేబినెట్‌ విస్తరణ సందర్భంలో తనకు చోటు కల్పించి, రాజగోపాల్‌కు ఎంపి టిక్కెటిస్తానని హామీనిస్తే కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమని రాయ బారం పంపారని విశ్వసనీయ సమా చారం. అయితే, కెసిఆర్‌ నుంచి పూర్తి సానుకూలత వ్యక్తం కాలేదని, ఎంపి సీటి వ్వడం సాధ్యం కాదని, ఎమ్మెల్సీని చేస్తానని, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గుర్తు చేస్తూ మంత్రి పదవి ఇవ్వడం వల్ల శాసనసభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం వుంటుందని కెసిఆర్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఎన్నికల సమయం లో టిఆర్‌ఎస్‌ టిక్కెట్లు ఆశించి భంగపడి కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్‌ డి.శ్రవణ్‌ కుమార్‌, కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌, కాచం సత్యనారాయణలు తిరిగి టిఆర్‌ఎస్‌ గూటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిసిసి ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్న శ్రవణ్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం, టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రముఖ నాయకులను తరచూ కలుస్తుండడంతో కాంగ్రెస్‌ను వీడవచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రవణ్‌కు సన్నిహి తులైన కట్టెల, కాచంలు కూడా అధికార పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబర్చుతు న్నట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: