ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 65వ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వ హించాలని వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. వైఎస్పాఆర్‌ జయంతి సం దర్భంగా రాష్టవ్య్రాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వ హించాలని పార్టీ గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలకు సూచించారు. మహానేత విగ్రహాలకు పాలతో అభిషేకం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు పిలుపునిచ్చారు. నియోజవర్గ, జిల్లా కేంద్రాల్లో వరుణ యాగాలను కూడా చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్త లకు సూచించింది. మహానేత ముఖ్యమంత్రి గా వున్న కాలంలో ఒక్క పైసా కూడా ఎలాంటి పన్ను విధించ కుండా అనేక సంక్షేమ పథకా లను కొనసాగించారని తెలిపారు. ప్రజలు నోరు తెరచి అడగక ముందే ఆ రోగ్యశ్రీ, 104, 108, ఫీజు రీఎం బార్స్‌ మెంట్‌, 47 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు ఆధు నిక సమా జ దేవాలయాలుగా చేపట్టి న ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఇం టిం టికి ఒక పథ కాన్ని ప్రవేశపెట్టిన రోజులు గుర్తుకు వస్తాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. వైఎస్సార్‌ విధానాలే తెలుగు ప్రజలకు ఏనాటికైనా శ్రీరామరక్ష అన్నారు. ఏటి వర్షాలు పడి అధిక దిగుబడితో రైతులు ఎక్కడ లేని లాభాలు ఆర్జిం చింది కూడా వైఎస్సార్‌ పాలనలోనే అన్నా రు. ఈ రోజు జూలై మొదటి వారం పూర్త వుతున్నా వర్షాలు పడకపోవడమే కాక సీ మాంధ్ర లోని 13 జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్ర తలు నమోదు కావడంతో వైఎస్సార్‌ పాలనను పదే పదే గుర్తు కు తెస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయప డు తుంది. ఈ నేపథ్యంలో ప్రజాసంక్షేమం కోసం ప్రతి నియోజ కవర్గ, జిల్లా కేంద్రంలో వరుణ యాగా లను చేపట్టాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపుని చ్చారు. అంతేకాకుం డా ఆయన జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కూడా సూచిం చారు.  కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం... దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్ర మం సందర్భంగా వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాల యం లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించి ంది. ఈ మేరకు పార్టీ వర్గాలు సోమవారం ఒక ప్రతిక ప్రకటన ను విడుదల చేశాయి. ఈ రక్తదాన శిబిరం కార్యాక్రమంలో అందుబాటులోని ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీ నేతలు, కార్య ర్తలతో పాటు వైఎస్సార్‌ అభిమానులు పాల్గొంటారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: