అసలుకు ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీని చూసుకోవాలని అనుకొన్నాడట మెగాస్టార్ చిరంజీవి. ఇక ఎన్నికల తర్వాత తమ్ముడు పవన్ కల్యాన్ కు బీజేపీలో ఉన్న ప్రాధాన్యతను చూసి అటుగా వెళ్లిపోదామని కూడా అనుకొన్నాడట. అయితే ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ ను వీడలేకపోతున్నాడు. భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లిపోయే ఉద్దేశం ఉన్నా ఆ కోరిక నెరవేర్చుకోలేకపోతున్నాడు. ఇందుకు కారణం ఒక్కటే.."రాజ్యసభ సభ్యత్వం' ఇప్పటికిప్పుడు మెగాస్టార్ గనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఆయన రాజ్యసభ సభ్యత్వం కాస్తా పోతుంది. కాంగ్రెస్ బలంతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి ఆ పార్టీకి రాజీనామా చే్స్తే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకోవాల్సి వస్తోంది. మరి అంత చేసి బీజేపీలోకి వెళితే వాళ్లు మళ్లీ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇస్తారా? అంటే అది కష్టమే! పవన్ కల్యాణ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది! మరి ఇటువంటి తరుణంలో ఇంకా దాదాపు నాలుగేళ్ల పదవీ కాలంలో ఉన్న మెగాస్టార్ కాంగ్రెస్ కు రాజీనామా చేయలేకపోతున్నాడట. రాజీనామా చేస్తే కాంగ్రెస్ వాళ్లు వెంటపడి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయిస్తారని, అలా ఉన్న పదవినీ కూడా వదిలేసుకోకుండా ఉండాలంటే... సైలెంట్ గా కాంగ్రెస్ లోనే ఉండటం మంచిదని మెగాస్టార్ అనుకొంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడప్పుడే చిరంజీవి కాంగ్రెస్ ను వదిలే అవకాశాలు లేవని అనుకోవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: