మహారాష్ట్ర లో కాంగ్రెస్ ఎన్సీపీల కూటమి పదిహేనుళ్లుగా అధికారంలో ఉంది. అనేక మంది ముఖ్యమంత్రులు మారడం, వివిధ రకాల వైఫల్యాలతో అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీలపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉంది. దీంతో ఈ సారి అక్కడ ఆ కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం, ఇక బీహార్ లో తమ జతను వీడిన జేడీయూ పని అయిపోయింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లడం, కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి పుంజుకోలేకపోవడంతో అక్కడా తిరుగులేదిక! యూపీలో లోక్ సభ ఎన్నికల్లో ఫలించిన హిందుత్వ ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలించే అవకాశాలున్నాయి. ఒకవైపు అఖిలేశ్ సింగ్ యాదవ్ పై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకత... కాంగ్రెస్ వైఫల్యం, మాయవతి పార్టీ కోలుకోకపోవడంతో ఇక్కడ తమకు తిరుగుండదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సాధించిన సీట్ల ప్రకారం చూసుకొన్న యూపీలో అధికారం తమదేనని బీజేపీ నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం రానున్న మూడు సంవత్సరాల్లో జరిగే వివిధ రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించగలమని కమలనాథులు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మోడీ వేవ్ పుణ్యానా కేంద్రంలో సొంతంగా అధికారం సాధించి ఇప్పుడు రాష్ట్రాలపై కూడా ప్రభావం కనిపిస్తుందని.. తమకు తిరుగుండదని ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే దేశ ప్రజలు మోడీ హయాంలోని బీజేపీకి గుడ్డికే ఓటేస్తారా? ఆయన ఏం చేస్తున్నాడు? అనేదాన్ని కూడా వాళ్లు పరిశీలిస్తారు కదా! మరి దాన్ని బట్టి కూడా బీజేపీ విజయావకాశాలుంటాయేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: