ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఎనిమిది మంది కౌన్సిలర్లను తమ పార్టీ వైపు తిప్పుకున్నారని నాలుగు జిల్లా పరిషత్తుల్లో తమ పార్టీ గెలిస్తే యుద్ధవాతావరణం సృష్టించి తెలుగుదేశం పార్టీ గెలుచుకొవటనికి ప్రయత్నించిందని వైయస్సార్ పార్టీ  నేత జగన్ వ్యాఖ్యానించారు. కడప తప్ప కర్నూలు, ప్రకాశం, నెల్లూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఏకంగా జెడ్పిటీసిలకు ఫోన్లు చేసి మాట్లాడే స్థాయికి దిగజారారని జగన్  ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని అనుకునేవారు కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు వంటి నియంతలు ఎక్కువ కాలం నిలబడరని ఆయన అన్నారు. జమ్మలమడుగు కౌన్సిలర్లతో వైయస్ జగన్ మంగళవారంనాడు సమావేశమై ప్రసంగించారు. ఎర్రగుంట్లలో 20 కౌన్సిలర్ స్థానాలకు 18 స్థానాలు తమ పార్టీ గెలుచుకుందని అయితే ప్రజాస్వామ్యం కుంటుపడి కౌన్సిలర్లు జెడ్పిటీసి ఎంపిటీసిలు క్యాంపులను నిర్వహించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో ప్రజలు  చంద్రబాబును నిలదీస్తారని ఆయన హెచ్చరించారు. త్వరలో ప్రధానిని కలుస్తామని చెప్పారు. ఏపి ముఖ్యమంత్రి  బాబు ఆగడాలు అందరూ గమనిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: