లోకసభలో బీజేపీ, తౄణమూల్‌ కాంగ్రెసు పార్టీ (టీఎంసీ) పార్లమెంటు సభ్యుల మధ్య మంగళవారం వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమ పట్ల అభ్యంతరకరంగా, అసభ్యంగా ప్రవర్తించాలని టీఎంసీ మహిళా ఎంపీలు ఆరోపించగా.. బీజేపీ ఎంపీలు ఖండించారు. టీఎంసీ ఎంపీలు కోకిలా ఘోష్‌ దస్తీదార్‌, కల్యాణ్‌ బెనర్జీలు మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్‌ను నిరసిస్తూ తాము లోకసభలో ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎంపీలు తమ పైన దాడి చేశారని ఆరోపించారు. ఓ బీజేపీ ఎంపీ తాగి ఉన్నాడని ఎంపీ దస్తీదార్‌ ఆరోపించారు. తాగిన బీజేపీ ఎంపీ సభలో అసభ్యంగా: మహిళా ఎంపీలు తమ పార్టీకి చెందిన మరో ఎంపీ శతాబ్దీ రాయ్‌ పట్ల కూడా బీజేపీ ఎంపీలు అమానుషంగా ప్రవర్తించారని, దాడి చేస్తామని బెదిరించారని వారు ఆరోపించారు. బెదిరించిన బీజేపీ ఎంపీ తాగి ఉన్నాడని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే, బేజీపీ మాత్రం టీఎంసీ మహిళా ఎంపీల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. టీఎంసీ డ్రామాకు తెరలేపుతోందని మండిపడ్డారు. ఎంపీలు సభను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సమయంలో టీఎంసీ ఎంపీలు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని విమర్శించారు. అలాంటి సమయంలో తాము సర్దుబాటుకు ప్రయత్నించాం తప్ప దూషించలేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: