తెలంగాణలోని భూదాన్ భూముల వివాదం ప్రభావం ఏపీపైనా పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్యాక్రాంతమైన భూదాన్ భూముల వివరాలును చంద్రబాబు సర్కారు సేకరిస్తోంది. ఆక్రమణకు గురైన వాటిని బహుళ ప్రజాప్రయోజనాలకు పనికి వచ్చేవిగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా వాటి స్వాధీనానికి ప్రణాళిక రచిస్తోంది. వినోభా బావే స్ఫూర్తితో వేలమంది దాతలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమవుతున్న తీరుపై చంద్రబాబు సర్కారు ఆరా తీస్తోంది. సదుద్దేశంతో ఇచ్చిన వేల ఎకరాల భూమిని అర్హులకు దక్కకుండాపోగా... కొన్నిచోట్ల అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాగుకు యోగ్యం కానివి, వివాదాల్లో ఉన్నాయనే కారణాలతో వేల ఎకరాలు నిరుపయోగం చేశారు. సరైన నిర్వహణ లేనుందునే వేల ఎకరాలు అక్రమార్కులపరమయ్యాయి. ఏపీలో మొత్తం 13జిల్లాల్లోను 3వేల240మంది దాతలు భూదాన ఉద్యమంలో పాల్గొన్నారు. 26వేల ఎకరాలు దానం చేశారు. వీటిని భూమి లేని పేదలకు పంచాలి. లబ్ధిదారుల ఎంపికకు నియమావళిని కొన్నిజిల్లాల్లో పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. 8వేల 179లబ్ధిదారులకే ఈ భూములు దక్కాయి. సాగుకు యోగ్యం కానివి, వివాదాస్పదమైనవీ వీటిలో ఉన్నాయని తేలింది. 4వేల756ఎకరాల భూమిని పంచకుండా వదిలేశారు. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయన్నది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: