గత ప్రభుత్వం ముందు చూపు లేని తనంతో చేజారిపోతాయనుకున్న వైద్య విద్య సీట్లలో కోత లేదని ఎంసీఐ తేల్చింది. చంద్రబాబు సర్కారు విజ్ఞప్తి మేరకు ఈ ఏడాదికి మినహాయిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. వీటికి కొన్ని కళాశాలలకు అదనంగా సీట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం వల్ల నష్టపోయిన రాష్ట్రానికి కొంత వరకు న్యాయం జరుగుతోంది. ప్రభుత్వ కళాశాల్లో సదుపాయాలు, అధ్యాపక సిబ్బంది కొరత కారణాలతో రాష్ట్రంలోని వైద్య విద్య సీట్లను మొదట ఎంసీఐ కోత విధించింది. మరికొన్ని సీట్ల కోతలకు రంగం సిద్ధమైంది. దీన్ని గ్రహించిన చంద్రబాబు... కేంద్రానికి, ఎంసీఐకు విజ్ఞప్తులు చేశారు. ఫలితంగా ఈ ఏడాది భారీ సీట్ల కోత నుంచి రాష్ట్రానికి ఊరట లభించింది. కొత్తగా ప్రభుత్వ రంగంలో 300, ప్రైవేటు రంగంలో 300 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. నెల్లూరు, తిరుపతిలో పద్మావతి ప్రభుత్వ వైద్య కళాశాలలో చెరో 150సీట్ల చొప్పున 300 సీట్లకు కొత్తగా అనుమతి లభించింది. సదుపాయాలు లేమి కారణంగా గతంలో అనుమతి ఇవ్వని ఒంగోలు ప్రభుత్వ కళాశాలకు వంద సీట్లు పునరుద్దరించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో 50, ఎస్వీ మెడికల్ కళాశాలో 50 సీట్ల చొప్పున ఎంసీఐ పునరుద్దరించింది

మరింత సమాచారం తెలుసుకోండి: