సల్మాన్ ఖాన్ కు సుప్రీం కోర్టు నోటీసులు పంపించింది. 1998లో జింకను వేటాడి చంపిన కేసులో ఆయనకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం పిల్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సల్మాన్ కు ఆదేశించింది. ట్రైయిల్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 1998 అక్టోబర్ 1న తన మూవీ హమ్ సాత్ సాత్ హైన్ షూటింగ్ టైంలో సల్మాన్ ఖాన్ జింకను వేటాడాడు. జోథ్ పూర్ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణి సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా సల్మాన్ ఖాన్ వ్యవహరించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ లైసెన్స్ లేని ఆయుధాలు కల్గున్నాడని కేసు బుక్ చేశారు. మొత్తానికి నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సల్మాన్ కు సుప్రీం నోటీసులు పంపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: