కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. జైట్లీ బడ్జెట్లోని ముఖ్యంశాలు: * 2015 ద్రవ్యలోటు 3.6 శాతం * ద్రవ్యలోటు 4.1 శాతానికి తీసుకు వస్తాం * ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం,అధిక వృద్ధి రేటును పెంచడమే ఎన్డీయే ప్రధాన లక్ష్యం * 7060 కోట్లతో 100 స్మార్ట్ సిటీలు * ట్యాక్స్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ * తయారీ రంగంలో ఎఫ్డీఐలు అభివృద్ధికి ఆశాదీపాలు * ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు రెండు యూనివర్శిటీలు * పెట్టుబడుల కోసం స్నేహపూరిత విధానం * ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ. 50,548 కోట్లు. * గ్రామాణ విద్యుదీకరణకు రూ. 500 కోట్లు. * గ్రామీణ తాగునీటికి రూ. 6,500 కోట్లు. * బాలికల సాధికారతకు రూ.100 కోట్లు. * ఆడపిల్లలను చదివించండి, రక్షించండి పథకానికి రూ. 500 కోట్లు. * మహిళల భద్రతకు రూ. 150 కోట్లతో పైలట్ ప్రాజెక్టు. * అంధుల కోసం బ్రెయిలీ లిపిలో కరెన్సీ నోట్లు. * సర్దార్ ఏక్తా విగ్రహానికి 200 కోట్లు * గ్రామ్ జ్యోతి పథకానికి రూ.500 కోట్లు * ఇందిరా వికాస్ పత్రాల ద్వారా పెట్టుబడుల * బీమా రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది * బీమా రంగంలో 49 శాతం ఎఫ్డీఐలకు కృషి * ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2లక్షల కోట్ల పెట్టుబడులు * సుస్థిరమైన పన్నుల వ్యవస్థకు రూపకల్పన * 2008నాటి ఆర్థిక సంక్షోభం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పాటు భారత్ పై కూడా ప్రభావం చూపింది. * పేదరికాన్ని నిర్మూలిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తాం. * ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా... పరిస్థితిని సమూలంగా చక్కదిద్దుతాం. * గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న జాప్యాల వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోయాం. * ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు. ఈ బడ్జెట్ ను సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రూపొందించాం. * నల్లధనం సమస్యను పరిష్కరించాల్సి ఉంది. * భవిష్యత్ తరాలకు అప్పును వారసత్వంగా ఇవ్వలేం. * జీఎస్ టీ అమలుపై ఈ ఏడాదే నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రాలతో చర్చించి జీఎస్ టీ పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. * పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఏర్పాటుచేస్తాం. * ఇన్స్యూరెన్స్ రంగంలో ఎఫ్ డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతాం. * రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 శాతానికి పెంచుతాం. * పట్టణ నిర్మాణ రంగంలో ఎఫ్ డీఐలను అనుమతిస్తాం. * కొత్త యూరియా విధానాన్ని ప్రవేశపెడతాం. * పన్ను చెల్లింపుదారుల సమస్యల సరిష్కారం కోసం కమిషన్ ను నెలకొల్పుతాం. * దేశంలో 100 స్మార్ట్ సిటీలను నెలకొల్పుతాం. వీటి కోసం రూ. 7060 కోట్లు వెచ్చిస్తాం. * దేశంలోని 9 విమానాశ్రయాల్లో వీసా ఆన్ అరైవల్ విధానాన్ని అమలుచేస్తాం. * గుజరాత్ లో నిర్మిస్తున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) రూ. 200 కోట్లు కేస్తాయిస్తున్నాం. * బ్యాంకింగ్ రంగాన్న మరింత బలోపేతం చేస్తాం. * కరెంటు ఖాతా లోటుపై నిరంతర నిఘా ఉంచుతాం. * నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. * వ్యవసాయాభివృద్ధికి 'పీఎం కృషి సచార్' పథకానికి రూ. 1000 కోట్లు. * 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ పథకం తీసుకువస్తాం. * ఆహార,చమురు సబ్సిడీలపై దృష్టి సారిస్తాం. * స్థూల జాతీయోత్పత్తి ఇంకా పెరగాలి. * రాబోయే 3, 4 ఏళ్లలో 7 నుంచి 8 శాతం వద్ధిని ఆశిస్తున్నాం. * పన్నుల వివాదాల వేగవంత పరిష్కారం దిశగా ట్రైబ్యునల్స్. * బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 26 శాతం నుంచి 49 శాతంకు పెంపు. * రక్షణ రంగంలోనూ ఎఫ్‌డీఐలు 26 శాతం నుంచి 49 శాతంకు పెంపు. * ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి నిలకడైన నిర్ణయాలే పునాది. * వ్యయ నిర్వహణ సంస్థను కేంద్రం నియమిస్తుంది. * వస్తు సేవల పన్నుపై చర్చకు ముగింపు పలకాలి. * తయారి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి రూ. 2.4 లక్షల కోట్లు. * తక్కువ వ్యయంతో గృహ నిర్మాణం, ఎఫ్‌డీఐలకు ప్రోత్సాహం. * నైపుణ్యాల పెంపునకు స్కిల్ ఇండియా కార్యక్రమం. * 9 విమానాశ్రయాల్లో ఈ విసా సదుపాయం. * బ్యాంకింగ్ వ్యవస్థకు మరింత స్వేచ్ఛ, జవాబుదారీతనం పెంపు. * పెట్టుబడులకు స్నేహపూర్వక పన్నుల విధానం. * ఆర్థిక వ్యవస్థకు నల్లధనం ప్రమాదకారిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: