భారత దేశంలో పొగరాయుళ్లకు కొదవ లేదు. గుప్పు గుప్పు మని సిగరెట్టు తాగుతుంటే ఆ మజాయే వేరు బాసూ అంటారు. సిగరేట్ తాగడం వల్ల అనేక రోగాలకు గురఅవుతూనే ఉంటారు అంతెందుకు సిగరెట్ ప్యాకెట్ పై ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ చూసి మరీ కాల్చేస్తుంటా సిగరేట్ ప్రియులు. భారతదేశంలో కేన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో వీటికి ప్రధాన కారణం పొగతాగడమేనని వైద్యులు ఎప్పటి నుండో చెప్తూ వస్తున్నారు. సిగరేట్ అయితే సిగరెట్ తాగే వాళ్లకు మాత్రం అరుణ్ జైట్లీ పొగ పెట్టాడు అంటే ఇప్పడు సిగరెట్లపై ప్రస్తుతం 11% పన్నును అమాంతం 72 % కు ఒక్కసారిగా పెంచేశారు. అంతేకాదండోయ్ పాన్ మసాల,గుట్కాలపై కూడా 60 % పన్ను ను విధించాడు. దీంతోనైనా భారత దేశంలో కొంత క్యాన్సర్ రోగానికి కళ్లెం వేద్దామనే సదుద్దేశంతో ఈ నిర్ణయిం తీసుకుని ఉండొచ్చు అని పలువురు అనుకుంటున్నారు.  ఈ విషయంపై అరుణ్ జైట్లీ వివరణ ఇస్తూ సిగరెట్ల మీద ధరలను పెంచాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇదివరకే తనను కోరిందని అయితే ఈ బడ్జెట్ లో దానికి రూపకల్పన చేద్దామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు. ఇక వీటితో పాటుగా కూల్ డ్రింకులు, సోడాలపై కూడా పన్నులు పెంచారు. దేశంలో ప్రధానంగా యువత ఈ పొగాకు ఉత్పత్తులపై మక్కువ పెంచుకుంటున్న తరుణంలో జైట్లీ పెంచిన పన్నుల మోతతో వీటి వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: