ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్ నేపథ్యంలో.. ఆయా వస్తువుల ధరల పెరుగుదల, తగ్గుదల ఇలా ఉండబోతున్నాయి. ఇవి ధరలు పెరుగుతాయి  1, సిగరెట్లు, పాన్ మసాలాలు, గుట్కాపై సుంకాలు పెంపు 2, సిగరెట్లపై ఎక్సయిజ్ సుంకం 11శాతం పెంపు 3, పాన్‌మసాలాలపై 12 శాతం నుంచి 16 శాతానికి పెంపు 4,గుట్కాపై 60 శాతం నుంచి 70 శాతానికి పెంపు 5, స్టీల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం 5 నుంచి 7 శాతం పెంపు 6,చక్కెరతో కూడిన కార్బొనేటెడ్ పానీయాలు మరింత ప్రియం 7, దిగుమతి చేసుకున్న కంప్యూటర్స్‌పై అదనపు సుంకం ఇవి ధరలు తగ్గుతాయి  1, పాదరక్షలపై ఎక్సయిజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు 2, టీవీలు, మొబైల్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం 3, ఫ్యాటీ ఆసిడ్స్, ఉన్ని దుస్తులు, గ్లిజరిన్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం తొలగింపు 4, బ్రాండెడ్ దుస్తులు, సబ్బులు, ప్రాసెస్డ్ ఫుడ్ ధరలు తగ్గే అవకాశం 5, ఇనుము ధరలు తగ్గే అవకాశం ఉద్యోగుల ఆదాయపు పన్ను పరిమితిని రు. 2 లక్షల నుంచి రు. 2.50 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్ల ఆదాయపన్ను పరిమితిని రు. 3 లక్షలవరకు పెంచారు. పొదుపును పెంచే ఉద్దేశంలో భాగంగా సెక్షన్ 80 సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు పై వచ్చే పొదుపు మొత్తాన్ని లక్ష నుంచి లక్షన్నర వరకు పెంచారు. ప్రతి ఇంటికీ రెండు బ్యాంక్ ఖాతాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. గృహ రుణాల వడ్డీమీద పన్ను మినహాయింపును 1.5 లక్షలనుంచి 2 లక్షలకు పెంచడం వల్ల.. గృహ రుణాలు తీసుకుని 80సీ కిందకూడా పొదుపును పాటించే ఉద్యోగులకు సుమారు లక్షన్నర రూపాయలవరకు ఊరట లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: