ఆదివారం ఉదయం సమయం.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలోకి ఓ తెల్ల టి కారు వేగంగా వచ్చింది. పైజమా, కుర్తా ధరించి, రిమ్‌లెస్‌ కళ్ళజోడుతో ఉన్న ఓ వ్యక్తి హుందాగా నడు చుకుంటూ లోపలికి వెళ్ళారు. కొద్దిసేపటి తరవాత ఆయన అదే కారులో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లారు. సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి మూడు రోజుల ముందు మాజీ ప్రధాని మన్మోహన్‌, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరూ? అనే ఆసక్తి కలగడం సహజమే. ఆ వ్యక్తి ఎవరో కాదు... ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ. ఆయన మాజీ ప్రధానిని ఎందుకు కలిసి ఉంటారనే సందేహం కలగడం లోనూ తప్పులేదు. ఇది కేవలం రొటీన్‌ అని అరుణ్‌ జైట్లీ చెబుతున్నప్పటికీ.. బడ్జెట్‌ ముందు ఈ సమావేశం ఏదో సలహా తీసుకోవడానికే అయి ఉంటుందనేది నిర్వివా దాంశం . ఇక్కడో మరో అంశం కూడా ఉంది. రాజ్యసభలో జైట్లీ ప్రతిపక్షంలో ఉన్న ప్పడు మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించేవారు. యూపీఏ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో లోపాలపై మండిపడేవారు. కానీ జైట్లీకి మన్మోహన్‌ సింగ్‌ను ఓ ఆర్థికవేత్తగా ఎంతో అభిమానం. 'మన్మోహన్‌ ఓ మంచి వ్యక్తి, చక్కటి ఆర్థిక మంత్రి' అంటూ జైట్లీ కిందటి లోక్‌సభ ఎన్నికల అనంతరం తన బ్లాగులో ప్రశంసించారు. జైట్లీ ఆర్థిక మంత్రి కాకముందు కూడా మన్మోహన్‌ను కలిశారు. సమాచార ముఖ్య కమిషనర్‌గా రాజీవ్‌ మాథుర్‌ ప్రమాణ స్వీకార సమయంలో ఈ సమావేశం జరిగింది. భారత ఆర్థిక పరిస్థితిపై జైట్లీతో మన్మోహన్‌ తీవ్ర ఆందోళ నను వ్యక్తం చేశారు. కొద్ది రోజులకే జైట్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: