టిఆర్ఎస్ ఎమ్.పిలు నిరసన చెబితే తాను బిల్లును ఆమోదింప చేయవలసి వస్తుందని స్పీకర్ సుమిత్ర మహాజన్ హెచ్చరించారు.టిఆర్ఎస్ సభ్యులు పోడియంలోకి వెళ్లి నినాదాలు చేస్తున్న సమయంలో స్పీకర్ ముందుగా టిఆర్ఎస్ ఎమ్.పి వినోద్ కుమార్ ప్రవేశపెట్టిన చట్ట బద్ద తీర్మానాన్ని తోసిపుచ్చుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ బిల్లును ఆమోదించాలని సభను కోరారు. తదుపరి ఆమె బిల్లును వాయిస్ ఓటు ద్వారా బిల్లు ను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.తెలంగాణ బిల్లు సందర్భంగా హడావుడి జరిగిన మాదిరే ఇప్పుడు కూడా జరిగింది.బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు.ఈ బిల్లును ఆమోదించడంతో భద్రాచలం డివిజన్ లోని ఏడు మండలాలు ఆంధ్ర లో విలీనం అవవడానికి లోక్ సభ ఓకే చేసినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: