అచ్చం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గతంలో జగన్ ను ఎలాగైతే ఇబ్బందుల పాలు చేసిందో.. అచ్చం అలానే ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఇరికిద్దాం అని చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. అయితే ఈ విషయంలో బీజేపీ నేతల కు న్యాయస్థానాలు సహకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పై వచ్చిన ఆరోపణల విషయంలో తక్షణం స్పందించిన న్యాయస్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ నేతల విషయంలో మాత్రం ఆ విధంగా స్పందించడం లేదు! ఇంతకీ విషయం ఏమిటంటే.. మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ అవినీతి బాగోతం అంటూ బలమైన ఆరోపణలతో మధ్య ప్రదేశ్ కోర్టుకు బీజేపీ నేతలు లేఖలు రాశారు. దిగ్విజయ్ అవినీతిపై విచారణ జరిపించాలని వారు కోర్టుకు విన్నవించుకొన్నారు! ఇప్పుడు విశేషం ఏమిటంటే... దిగ్విజయ్ విషయంలో వచ్చిన ఈ లేఖలను కోర్టు పట్టించుకోకపోవడం. ఇది పద్ధతి కాదు అంటూ లేఖలు రాసిన సదరు నేతలకు హితవు పలకడం. లేఖలు రాసినంత మాత్రానా, పిటిషన్లు వేసినంత మాత్రాన విచారణ జరిపించలేమని స్పష్టం చేయడం! జగన్ విషయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు చేసినట్టుగానే ఇప్పుడు బీజేపీ నేతలు దిగ్విజయ్ సింగ్ విషయంలో చేశారు. అయితే వారి ప్రయత్నాలకు కోర్టు సహకరించడం లేదు. ఈ విధంగా జగన్ విషయంలో ఒక న్యాయం, దిగ్విజయ్ సింగ్ విషయంలో మరో న్యాయం అమలవుతోంది! మరి అధికారం పార్టీ ఒత్తిడి లేకపోతే కోర్టులు కూడా విచారణ కమిషన్ లను నియమించడానికి, సీబీఐ విచారణలకు తొందరపడవేమోనని స్పష్టంగా అర్థమవుతోందిప్పుడు!

మరింత సమాచారం తెలుసుకోండి: