ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఎక్కడ అంటూ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం తలపట్టుక్కూర్చుంటే ఎంచక్కా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానాల్లో బిజీగా వున్నారు. ఇప్చంపటి చంద్రబాబు కి రుణమాఫీ వ్యవహారం మింగలేని మందుమాత్రగా మారే ప్రమాదం వచ్చి పడింది. రుణమాఫీకి మార్గదర్శ సూత్రాల కోసం వేచి చూస్తున్న రుణమాఫీకి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే రుణమాఫీకి నిబంధనలు ఆటంకంగా మారాయి.  ముఖ్యమంత్రిగా హంగూ ఆర్భాటాలతో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రజానికం ముందు వాగ్ధానాలు చేసి అవి నెరవేర్చే యోచనలో చంద్రబాబు వాటి సాధ్యాసాధ్యలపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ రోజులు వుంటాననీ వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ఆంధ్రప్రదేశ్‌ నుంచే చేసుకునేలా చర్యలు తీసుకుంటాననీ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరులోగా రాజధానిపై స్పష్టత వస్తుందని అన్నారు. విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని అని దాదాపు స్పష్టత ఇచ్చేసిన చంద్రబాబు కేంద్రం నియమించిన కమిటీ ఏం చెబుతుంతో అని అందరూ ఉత్కంఠంగా వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: