పోలవరం ముంపుగ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు సంబంధించిన బిల్లు ఇంకా రాజ్యసభలో కూడా ఆమోదం పొందవలసి ఉంది. ఎలాగైనా సరే తమ ప్రతిభావాటవాలను, సంబంధ బాంధవ్యాలను ప్రదర్శించి ఈ బిల్లును రాజ్యసభలో నెగ్గకుండా చేయాలని పావులు కదుపుతున్నారు. ఒక చిన్న రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీగా జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నాయకులతో తమకు ఉండే సంబంధాలు తక్కువ కావడంతో తమ పార్టీ సెక్రటరీ జనరల్‌, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ ఎంపీగా అదే రాజ్యసభలో సుదీర్ఘ అనుభ వం ఉన్న కేశవరావు మీద తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువగా ఆధారపడుతోంది.పార్టీ తన భుజస్కం ధాల మీద పెట్టిన తొలి బాధ్యతను సక్రమంగా నెర వేర్చడానికి ఢిల్లీలో కేకే విపరీతంగా శ్రమిస్తున్న ట్లుగా ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ఇతర పార్టీలకు చెందిన రాజ్యసభ ఎంపీలను కల వడంలో చాలా బిజీగా గడుపుతున్నారు. వారందరినీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి వంటి వారి సహాయాన్ని కూడా ఆయన తీసుకుం టు న్నారని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీలు ఎవరైనా ఉంటే వారు ఈ బిల్లును వ్యతిరేకించవచ్చు గానీ మిగిలిన కాంగ్రెస్‌ సభ్యులు ఎలా వ్యవహరిస్తా రనేది ఆసక్తి కరం. కాంగ్రెసు లోక్‌సభలో ఓటింగ్‌ సందర్భంగా విప్‌ ఇవ్వకుండా తటస్థంగా వ్యవహ రించాలని అనుకున్నట్లే రాజ్యసభలో కూడా ఉం టుందా అని పలువురు యోచిస్తున్నారు.కాంగ్రెస్‌ వారి ద్వారా ఇతర పార్టీల వారికి కూడా ఫోన్లు చేయించి బిల్లు గురించి కేకే కలుస్తున్నారట. దానికి తగ్గట్టు ఆయనకు రెండురోజులు పార్లమెంటుకు సెలవులు కూడా కలసి వచ్చాయి. ఈ సెలవురోజుల్లో సదరు సీనియర్‌ నేత మాత్రం తతిమ్మా వారిని కలవడంలో చాలాచాలా బిజీగా ఉన్నారట.తనతోపాటూ తెరాసకు చెందిన మరికొందరు ఎంపీలను కూడా వెంటబెట్టుకుని హడావిడిగా తిరుగుతున్నారని చెబుతున్నారు. మరి ఎలాంటి ఫలితం సాధిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: