రాజకీయ నాయకులపై వాతావరణం కూడా ఒక్కోసారి పగపడుతుందేమో.. ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే అలాగే అనిపిస్తుంది. సెంటిమెంట్లను నమ్మని వారు కూడా ఒక్కోసారి వీటిని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే.. చంద్రబాబు ఏపీ సీఎంగా డిసైడ్ కాగానే.. ఇక వర్షాలు ముఖం చాటేశాయి. రాజకీయాలకూ, వాతావరణానికి సంబంధం లేదు కాబట్టి ఇది యాదృశ్చికమే అనుకోవాలి. కాకపోతే.. చంద్రబాబు గత 9 ఏళ్ల పాలనా కాలంలోనూ ఇదే పరిస్థితి తలెత్తడం వల్ల.. మళ్లీ అదే కరువు రోజులు రిపీటవుతాయేమోనని అంతా భయపడిపోతున్నారు. అసలు ఎన్నకల్లో చంద్రబాబు గెలుపు ఖాయమనే సంకేతాలు వచ్చీరాగానే.. అప్పుడే ఎల్ నినో ప్రభావంపై కథనాలు వెలువడ్డాయి. అదిగో ఎల్ నినో వస్తూ..వస్తూ.. తనను తట్టుకునే నాయకుడిని కూడా వెంటతెచ్చుకుందని కొందరు పొలిటికల్ కామెడీ కూడా పండించారు. అదేం మాయో తెలియదు కానీ.. అటు వైఎసా పాలనలోనూ.. ఆ తరవాత వచ్చిన రోశయ్య,కిరణ్ పాలనలోనూ ఎప్పుడూ వర్షాల కోసం ఇంతగా ఎదురు చూసింది లేదు. అసలే భయపడి చస్తున్న జనాలను జ్యోతిష్యులు ఇంకొంచెం హడలకొట్టి చంపేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి వర్షాభావం తప్పదని జ్యోతిష్య పండితుడు రమణారావు గురూజీ చెప్పారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు గ్రహస్థితిని అంచనా వేసే తాను ఈ విషయాన్ని చెబుతున్నానని ప్రకటించారు. ఈయనే కాదు.. గతంలో మరో ఇద్దరు స్వామీజీలు కూడా ఇదేమాట చెప్పడం విశేషం. అదే నోటితో రమణారావు కొన్ని శుభవార్తలు కూడా చెప్పాడు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు మహర్దశ పడుతుందన్నారు. త్వరలో ఆయన ఉప ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇంట్రస్టింగ్ ఎక్స్ పెక్టేషన్ చెప్పారు. చంద్రబాబు సంగతి ఇలా ఉంటే.. కేసీఆర్‌కు మాత్రం అంతా మంచే జరుగుతుందంటన్నారు ఈ రమణారావు గురూజీ.. తెలంగాణలో వర్షపాతం కొంత మెరుగ్గా ఉంటుందని... కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు... కేసీఆర్ హయాంలో హైదరాబాద్ అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలుగుతుందన్నారు. అంతే కాదు... ప్రధాని మోడీ చాలా అద్భుతాలు చేస్తారనీ.. కానీ, ఆయన్ను పదవి నుంచి దించడానికి కొందరు బలంగా పనిచేస్తున్నారని వివరించారు. మరి ఈయన జోస్యం ఎంతవరకూ నిజమవుతుందో కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: