మంగళగిరి టీబీ శానిటోరి యంనకు చెందిన స్థలంలో రూ.1500 కోట్ల వ్యయంతో అధునాతన వసతులతో కూడిన అతిపెద్ద ఎయిమ్స్‌ (అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ) ఆస్పత్రిని నిర్మించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని టీబీ శానిటోరి యం, అమరావతి టౌన్‌షిప్స్‌ స్థలాలను మంత్రి కామినేని గురువారం పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను స్థల పరిశీలన కోసం వచ్చానని చెప్పిన మంత్రి.. స్థల వివరాలను రెండురోజుల్లో నిర్ధారించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. మంగళగిరి టీబీ శానిటోరియం ఆస్పత్రికి చెందిన 185 ఎకరాలతో పాటు అటవీ భూమి ఇక్కడ ఉందని ప్రభుత్వానికి అవసరమైతే దీనిని డీ నోటిఫైడ్‌ చేయవచ్చని మంత్రి చెప్పారు.  రెండు జాతీయ రహదారుల మధ్య, రెండు కొండల నడుమ కాలుష్య రహిత వాతావరణంలో ఎయిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణా నికి స్థలం చక్కగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ నిర్మాణం జరగనున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ భవనాలను అమరావతి టౌన్‌షిప్‌కు చెందిన స్థలంలో నిర్మిస్తే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీని కూడా టీబీ శానిటోరియం స్థలానికి మార్పు చేసి, విజయవాడ హెల్త్‌ యూనివర్శిటీ ఉన్న ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ ప్రతిపాదన ను పరిశీలిస్తున్నామన్నారు. మంగళగిరిలో నిర్మించబోయే ఎయిమ్స్‌ ఆస్పత్రి అత్యంత అధునాతన ప్రమాణాలతో ఉంటుందని, దేశంలో పాండిచ్చేరిలో ఈ తరహా ఆస్పత్రి ఉందని అదే తరహా నిర్మాణాన్ని ఇక్కడ కూడా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే బడ్జెట్టులో ఎయిమ్స్‌ నిర్మాణానికి రూ.125 కోట్లు మంజూరు చేశారని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనలన్నీ కేంద్రానికి పంపుతామని, మరో వారంరోజు ల్లో కేంద్ర బృందం స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పా రు. చినకాకాని వద్ద పదెకరాల స్థలంలో కేన్సర్‌ ఆస్పత్రిని పునర్నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం పేదలకు అనుగుణంగా ప్రతి నిర్ణయం తీసుకుంటుందని , అందులో ఏ సందేహం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్ట ర్‌ కాంతిలాల్‌ దండే, ఆర్డీఓ రామ్మూర్తి, మంగళగిరి తహసీల్దా ర్‌ శివరామకృష్ణ, నియోజకవర్గ దేశం పార్టీ ఇన్‌చార్జి, మంగళ గిరి మునిసిపల్‌ చౖైెర్మన్‌ గంజి చిరంజీవి తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: