పల్లెలకు కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు, వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా! ఇదీ ప్రభుత్వం ఎన్నికలు అయ్యాకా.. చెప్పిన మాట. కేంద్రం పైలెట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ ను ఇవ్వాలని భావిస్తోందని, అక్టోబర్ నుంచి ఈ పథకం కింద సీమాంధ్రలోని పల్లెలకు కూడా 24 గంటల విద్యుత్ సరఫరా ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధఫ్రదేశ్ తో పాటు రాజస్థాన్ లో కూడా ఈ పథకాన్ని అమలు పెట్టనున్నట్టు సమాచారం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకొంటోంది. అక్టోబర్ నుంచి 24 గంటల కరెంటు అంటూ ప్రజలను ఊరిస్తోంది. ఎవరో ఒకరిఘనతలే.. కరెంటు వస్తే చాలు అనుకొంటే.. అప్పుడే ఈ పథకంలో కూడాకొర్రీలు ఉన్నాయని అంటున్నారు. రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, బంగారు రుణాల మాఫీలాగే.. ఇప్పుడు...ఈ కరెంటు పథకంలోకూడా బోలెడు షరతులు ఉన్నాయని తెలుస్తోంది. అందులో ముఖ్యమైనది దీన్ని కొన్ని జిల్లాలకే పరిమితం చేయడం! ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకూ ఈ 24 గంటల కరెంటు ఉండదని, కేవలం నాలుగు జిల్లాలకు మాత్రమే పవర్ ను అలా సప్లై చేయనున్నారనేది లేటెస్ట్ అప్ డేట్. మరి ఆ నాలుగు జిల్లాలు ఏవి అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. బీజేపీ వాళ్లేమో ఉత్తరాదిలో తాము అధికారంలో ఉన్న రాజస్థాన్ లో.. దక్షిణాదిలో తమమిత్రపక్షం అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసి.. ఈ పథకాన్ని ప్రారభిస్తున్నారు. మరి తెలుగుదేశం వాళ్లు.. రాష్ట్రంలోని ఏ జిల్లాలను ఎంపిక చేసుకొని.. ఈ పథకాన్ని అమల్లో పెట్టిస్తారో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: