ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చం పల్లి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటిం చడంతో పాటు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభి వృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు సమకూ ర్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) పార్లమెంట్‌ సభ్యుడు బాల్కసుమన్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ గుండా రెండు జీవనదులు-గోదావరి, కృష్ణా ప్రవహిస్తు న్నప్పటికీ వాటిని రాష్ట్రంలో సేద్యపునీటి అవసరాలకు వినియోగించుకొనే భారీ ప్రాజెక్టులు లేవని గతరాత్రి లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై కొనసాగిన చర్చలో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి తొంభై శాతం నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, సింగరేణి కాలరీస్‌ ఉద్యోగులను ఆదాయపు పన్ను నుంచి మినహా యించాలని, రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్‌ కేటాయించి పునర్వ్యవ స్థీకరించాలని, హైదరాబాద్‌- - వరంగల్‌ మధ్య, కాగజ్‌నగర్‌-- కొత్తగూడెం మధ్య పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని బాల్కసుమన్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అభివృద్ధి అవసరాల ప్రస్తావనే లేకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన టీఆర్‌ఎస్‌ సభ్యుడు షెడ్యూల్డు కులాల సంక్షేమానికి వారి జనాభా ప్రాతిపది కగా, రాజ్యాంగపరంగా కల్పించిన రిజర్వేషన్ల శాతానికి అనుగుణంగా కేంద్ర బడ్జె ట్‌లో పదహారు శాతం నిధులను కేటాయించాలని, అలాగే, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, సంక్షేమానికి కూడా నిధుల కొరత లేకుండా ప్రత్యేక శ్రధ్ధ వహించాలని బాల్క సుమన్‌ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: