వివాదాస్పద పోలవరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణలో 7 మండలాలలోని 200కి పైగా ముంపు గ్రామాలను, అలాగే ముంపునకు గురికాని పలు గ్రామాలను పరిశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనం చేయాలని నిర్ధారించిన బిల్లుకు పార్లమెంటు గత వారమే ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. తాజాగా, ఈ బిల్లుకు రాష్ట్రపతి ప్రణాబ్‌ ముఖర్జీ తన అంగీకారం తెలియజే యడంతో ఇది చట్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి గురువారం అంగీకారం తెలపడంతో చట్టంగా ఏర్పడినట్లు అధికార వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో 50 వేలకు పైగా కుటుంబాలు ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులవుతారు. గిరిజనుల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, కేంద్రం ఈ సవరణ బిల్లుకు నిరసనల నడుమ ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: