తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వస్తున్న తొలి గోదావరి పుష్కరాలు 2015 జులై 15 నుంచి మొదలవుతాయి. ఈ గోదావరి పుష్కరాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ పుష్కరాల సందర్బంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, భద్రత, నిధుల విడుదల తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ అధికారులకు సూచించారు.  ఎట్టి పరిస్థితులలోను పుష్కరాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. అంతేకాకుండా ఈ పుష్కరాలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పుష్కరాలపై అవగాహనా కోసం ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి అధ్యక్షతన జగద్గురు శంకరాచార్యుల వద్దకు వెళ్ళాలని కేసీఅర్ తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తులకు రావణ సంబంధిత ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: