శాసనమండలి వ్యవస్థను రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదించడంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా వ్యతిరేకించారు.కేంద్రం ఇలాంటి ప్రతిపాదనలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలి రద్దు కావాలంటే మూడింట రండువంతుల మెజార్టీతో శాసనసభ తీర్మానం చేయాలని,అంతే తప్ప కేంద్రం ఇందులో తలదూర్చడం సరికాదని యనమల అన్నారు.శాసనమండలి అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు అని,దానిని రద్దు చేయాలని కేంద్రం ఆలోచించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. యనమల కూడా ప్రస్తుతం శాసనమండలిలో సభ్యుడే.అదికారంలోకి వచ్చే ముందు ఆయన తెలుగుదేశం పక్షాన విపక్ష నేతగా కూడా ఉన్నారు.అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే 1985 లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనమండలిని రద్దు చేయాలని తీర్మానించింది.ఆ తర్వాత తిరిగి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004 లో ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి మండలి పునరుద్దరణ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: