ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కనెక్షన్ లేని లక్షా 72 వేల ఇళ్లకు ఫ్రీగా కనెక్షన్లు ఇవ్వాలని భావిస్తుంది. దారిద్య రేఖకు దిగువగా ఉన్న వారికి ఫ్రీ పవర్ కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎస్ అలోక్ రంజన్. దీని గురించి ఇప్పటికే కొంత మంది అధికారులతో చర్చించారు. కావాల్సిన సౌకర్యాల గురించి వ్యూహాలు రచిస్తున్నారు. 201 డివిజన్లలో 166 విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నామని ఈ ఏడాది అక్టోబర్ లోపు ఇది పూర్తవుతోందని..మిగతా ఏరియాల్లోనూ 2015లోపు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.   ఇక యూపీ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు పవర్ సప్లై చేయాలని భావిస్తున్నామని…దీని కోసం 122 ట్రాన్సిమిషన్ సబ్ స్టేషన్ల నిర్మాణం జరగాలన్నారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందించేందుకు కావాల్సిన విద్యుత్ గురించి నివేదికలు రెడీ చేస్తున్నామని…సోలార్ పవర్ ను కూడా వినియోగించుకుంటామని ఆయన అన్నారు. పలు ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని…వాటిని త్వరలోనే పూర్తి చేసి విద్యుత్ లోటు లేకుండా చేస్తామన్నారు. ఇప్పటికే వీటికి టైం బౌండ్ డిసైడ్ చేశామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: