తెలుగుదేశం అధినేత తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు.. ఈ రోజుల్లో జనాలందరూ సెల్ ఫోన్ వాడుతున్నారంటే.. అందరికీ కంప్యూటర్ దగ్గరైందంటే అది తన వల్లనేనని. ఎన్నికల ప్రచార సభల్లో అయితే బాబు ఇదే మాటను చాలా స్పష్టం గా చెప్పుకొన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ కన్నా టెక్నాలజీ విషయంలో కర్ణాటక వంటి రాష్ట్రాలు చాలా ముందున్నాయని విషయం తెలిసినా.. బాబు మాత్రం దేశానికి టెక్నాలజీ ప్రదాతను తానేనని చెప్పుకొంటుంటారు. మరి ఆ మాటలను జనాలను నమ్మినట్టుగానే ఉన్నారు. అందుకే బాబుకు ముఖ్యమంత్రిగా పట్టం గట్టారు. ఆ సంగతి అలా ఉంటే.. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంశాన్ని బాబు చేతుల నుంచి హైజాక్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు. కంప్యూటర్లు తాను తెప్పించానని చెప్పుకొంటున్న చంద్రబాబును కంట్రోల్ చేయడానికి కేసీఆర్ అండ్ కో వైఫై, 4జీ సేవల మీద కాన్సన్ ట్రేట్ చేసింది. ఇది వరకే కేటీఆర్ చాలా స్పష్టం గా చెప్పాడు. హైదరాబాద్ లోని చాలా చోట్ల తాము వైఫై హాట్ స్పాట్ లను పెట్టిస్తామని ఆయన ప్రకటించాడు. ఐటీశాఖ మంత్రిగా ఆయన ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు. ఆయన సంగతి అలా ఉంటే... ఇప్పుడు తెలంగాణలో 4జీ సేవలను విస్తరించే ఏర్పాట్లు జరుగుతున్నాయట. తెలంగాణలోని మారు మూల పల్లెల్లో కూడా 4జీ ఇంటర్నెట్ అందుబాటులోకి రానున్నదట! ఒకవైపు సీమాంధ్ర ఇప్పటికీ 2జీకే పరిమితం అయ్యింది. జిల్లా ప్రధాన కేంద్రాల్లో 3జీకొంత వరకూ అందుబాటులో ఉన్నప్పటికీ... మండల కేంద్రాల్లో 2జీ సిగ్నల్స్ లభించడం కూడా కష్టమే. తెలంగాణలో మాత్రం ఇక నాలుగో తరం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకవేళ ఇదే పనిని సీమాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం చేసి ఉంటే.. ఎంత ప్రచారం పొందే వాళ్లో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. మొత్తానికి టెక్నాలజీ విషయంలో చంద్రబాబు ను కేసీఆర్ ఓవర్ టేక్ చేసేలాగానే ఉన్నాడు! ఈ పోటీలో బాగు వెనుకబడిపోయేలానే ఉన్నాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: