గత కొన్ని రోజులుగా కనిపిస్తున్న ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు.. మీకు మీరే, మాకు మేమే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం. అంతకు ముందంతా.. బాబు, మోడీ ఒకరికి చెప్పకుండా మరొకరు ఏమీ చేయన్నట్టుగా కనిపించినా, మీడియా అలాంటి కలరింగ్ ఇచ్చినా.. ఇప్పుడు మాత్రం అలాంటి దృశ్యాలు కనిపించడం లేదు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి మోడీ విదేశీ పర్యటనలతో బిజీ కావడం, ఇక్కడ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేతకు కొత్త ఒత్తిళ్లు మొదలు కావడంతో... ప్రశాంతంగా గడపడానికి, తమ దర్పాలు ప్రదర్శించుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది. మీడియా కూడా మోడీకి బాబు ఎంత చెబితే అంత.. అన్నట్టుగా మొన్నటి వరకూ కలరింగ్ ఇచ్చింది. అయితే ఆ మధ్య బాబు ఢిల్లీకి వెళ్లి మోడీని కలవలేకపోవడం, మరోవైపు రాష్ట్రంలో రుణమాఫీ వంటి వ్యవహారాల్లో తెలుగుదేశం నేతపై ఒత్తిడి తీవ్రం కావడంతో... అలాంటి బిల్డప్పులకు అవకాశం లేకుండా పోతోందని చెప్పవచ్చు! రాష్ట్ర పరిస్థితి సవ్యంగా లేకపోవడం, ఇచ్చిన హామీల్లో దేన్నీ సరిగా అమలు చేసే పరిస్థితి లేకపోవడంతో తెలుగుదేశం అదినేతకు కేంద్ర రాజకీయాలపై దృష్టిపెట్టే అవకాశమే లేకుండా పోతోంది. రాష్ట్రం అధికారం చేతికి అందితే, మెజారిటీ ఎంపీ సీట్లు దక్కితే, కేంద్రంలో అధికార కూటమలోని భాగస్వామిని అయితే.. ఒక రేంజ్ లో చక్రం తిప్పవచ్చని చంద్రబాబు భావించాడు. అయితే ఇప్పుడు అవేవీ జరగడం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. మోడీకి, బాబుకు మధ్య గ్యాప్ వచ్చిందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అందరు ముఖ్యమంత్రులనూ ఎలా ట్రీట్ చేస్తున్నాడో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా మోడీ జీ అలాగే ట్రీట్ చేస్తున్నాడు. అయితే తెలుగుదేశం అభిమానులు ఇంతకు మించి ఎక్స్ పెక్ట్ చేశారు. మరి అది ఎప్పుడు లభిస్తుందో ఏమో!

మరింత సమాచారం తెలుసుకోండి: