భారతీయ జనతా పార్టీ నేతలకు అవసరమైనప్పుడల్లా ఎమ్.ఐ.ఎమ్.మీద విరుచుకుపడుతుంటారు.టిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణల కూల్చివేత సాగిస్తుండడంపై ఆ పార్టీ అద్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. పాతబస్తీలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని కూల్చాలనిడిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఎమ్.ఐ.ఎమ్. అద్యక్షుడు ఒవైసీకి చెందిన ఆస్పత్రి నిర్మాణం కూడా అక్రమమేనని తేల్చారు.అందువల్ల దానిని కూడా కూల్చాలని డిమాండ్ చేశారు. ఒవైసీ ఆస్పత్రి అక్రమ నిర్మాణమా! ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కెసిఆర్ క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. బిజెపి మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. స్థానికతకు సంబందించి 1956 కొలమానం పెట్టడం సరికాదని కూడా కిషన్ రెడ్డి అన్నారు. ఓవైసీ ఆస్పత్రి భవనం కూడా అక్రమమేనని కిషన్ రెడ్డి చెప్పడం ఆసక్తికరం. ఇటీవల టిఆర్ఎస్ కు ఎమ్.ఐ.ఎమ్. మద్దతు ప్రకటించిన నేపధ్యంలో బిజెపి నేతలు ఇలా విరుచుకుపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: