ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా విరాళాలు అందజేయాలంటూ ఏపీ సచివాలయంలో హుండీ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ముఖ్యకార్యదర్శులకు కేటాయించిన ఎల్-బ్లాకు ప్రధానమార్గం వద్ద తాజాగా ఒకదానిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే! మరో రెండు హుండీలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిథిగృహం, సీఎం నివాసం అయిన జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసినప్పటికీ లేక్‌వ్యూలో పెట్టిన దాన్ని తొలగించాలని భావిస్తున్నారు.  సచివాలయానికి వచ్చే విజిటర్లు, ఉద్యోగులు ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేవారికోసం దేవాదాయశాఖ సుమారు ఆరడుగుల ఎత్తులో ఎల్-బ్లాకు వద్ద ఈ హుండీని ఏర్పాటు చేసింది. అయితే ఇది వివాదాస్పదం కావడంతో సాయంత్రానికి తొలగించారు. హుండీ ఏర్పాటు విషయం ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి తెలిసిన వెంటనే దాన్ని అక్కడి నుంచి ఎత్తివేశారు. ఈ హుండీల వ్యవహారంపై వైకాపా నాయకులు అప్పుడే విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: