భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపయోగించే విమానంపై బుక్ రకం క్షిపణులు ప్రయోగించినా ఎలాంటి ప్రమాదం వాటిల్లదు కదా.. ఆ క్షిపణినే ముప్పతిప్పలు పెట్టి గమ్యాన్ని మార్చేసే శక్తి ఉంది. అంటువంటి టెక్నాలజీతో ఆ విమానం తయారు చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇందుకోసం ఆయన ఎయిరిండియా-వన్ విమానంలో చేరుకుని, అదే విమానంలో భారత్‌కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఉక్రెయిన్ గగనతలం మీదే... మలేసియా విమానం ప్రయాణించిన మార్గంలోనే వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో, ఈ ప్రయాణం ఒక్కసారిగా చర్చల్లో నిలిచింది. మలేసియా విమానంపై దాడిచేసిన దుండగులు ప్రధాని విమానంపై క్షిపణి ప్రయోగించి ఉంటే పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న అందర్లోనూ కలుగుతోంది. అయితే, దీనికి ఒకటే ఆన్సర్. అది ఏమిటంటే... ఏమీ కాదని. అవును, క్షిపణి ప్రయోగించినా ప్రధాని ప్రయాణించే ఎయిరిండియా-వన్ విమానానికి ఏమీ కాదు. ఎందుకంటే ఈ విమానంలో రూ.200 కోట్ల ఖర్చుతో క్షిపణి దాడులను పసిగట్టి వాటిని దారిమళ్లించే ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజరర్స్ (ఈసీఎమ్) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయోగ స్థావరం నుంచి క్షిపణిని ప్రయోగించగానే... విమానంలోని రాడార్ దాన్ని పసిగడుతుంది. వెంటనే క్షిపణిని తప్పుదారి పట్టించే సంకేతాలను విడుదల చేస్తుంది. దీంతో, ఎలాంటి క్షిపణి అయినా ఈ విమానాన్ని ఢీకొనలేక పక్కదారి పడుతుంది.  కాగా, 2009లో ప్రధాని, వీవీఐపీల ప్రయాణం కోసం భారత వైమానిక దళం రూ.936.93 కోట్లు వెచ్చించి 46 సీట్ల సామర్థ్యమున్న మూడు బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌ (బీబీజే)లను కొనుగోలు చేసింది. వాటిలో మరో 200 కోట్లు వెచ్చించి క్షిపణి దాడులను పసిగట్టి దాడుల నుంచి రక్షించే ఎలక్ట్రానిక్‌ కౌంటర్‌మెజరర్స్‌ (ఈసీఎమ్‌) వ్యవస్థను ఏర్పాటు చేసింది. క్షిపణి ప్రయోగ స్థావరం నుంచి క్షిపణిని ప్రయోగించిన వెంటనే కాక్‌పిట్‌లోని రాడార్‌ వ్యవస్థ దానిని పసిగట్టిన వెంటనే ఈసీఎమ్‌.. క్షిపణిని తప్పుదారి పట్టించేలా సంకేతాలను విడుదల చేస్తుంది! దేశ ప్రధాని విమానంపైకి వదిలిన క్షిపణి సైతం ఈసీఎమ్‌తో చిన్నబోవాల్సిందే మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: