సార్వత్రిక సమరంలో చిత్తు చిత్తుగా ఓడిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించింది. పదేళ్లపాటు అటు కేంద్రంలో యూపీఏ కూటమిగా అధికారంలో ఉండి... మొన్నటి ఎన్నికల్లో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ప్రతిపక్ష హోదాకు సైతం పాకులాడాల్సి వస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనూ రెండు దఫాలు అధికారం పీఠం పై కూర్చుని... తాజా పోరులో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటమినే చవి చూసింది. ఏపీలో ఒక్క సీటు కూడా గెల్చుకోక చతికిలపడగా... తెలంగాణలో మాత్రం 21 సీట్లతో పరువు నిలబెట్టుకుంది. భారీ ఓటములతో కుదుపులకు గురైనా... ఇప్పుడు పార్టీ ప్రక్షాళనపై అధినాయకత్వం దృష్టి పెట్టినట్టుంది. అందుకే తెలంగాణలో సారథి మార్పు దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొనసాగుతున్నారు. తెలంగాణ తొలి పీసీసీ చీఫ్ గా పార్టీ పగ్గాలు అందుకున్నపొన్నాల... పార్టీని మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయారు. పార్టీ సంగతి పక్కన పెడితే తాను కూడా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో అప్పటి నుంచే తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నేతలు పీసీపీ తీరుతోనే ఓటమి పాలయ్యామని బహిరంగంగానే విమర్శించారు. ఇటీవల జరిగిన సమావేశంలోనూ నాయకత్వం తీరుపైనే కార్యకర్తలు తన్నుకున్నారు. ఇవన్నీ గమనిస్తున్న అధిష్టానం సారథిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమాచారం ముందుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు చేరిందేమో... తాను పీసీసీ చీఫ్ రేసులో లేనని అంటున్నారు. ఒకవేళ అధిష్టానం కోరితే మాత్రం తప్పకుండా ఆ పదవి చేపడతానని కూడా చెప్పారు. గెలుపు, ఓటముల సంగతి ఎలా ఉన్నా అందరూ సోనియా బాటలో నడవాలని స్వామి భక్తి కూడా చాటుకున్నారు. కాంగ్రెస్ లో ఏ పదవి కోసమైనా పదుల సంఖ్యలో పేర్లు వినిపించడం ఖాయం. మరి పీసీసీ చీఫ్ ను మార్చే ప్రతిపాదన నేపథ్యంలో ఇంకెందరు నేతల పేర్లు రేసులో చేరతాయో... ఇప్పటికే తెలంగాణ సీఎల్పీ నేతగా ఎంపికైన జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, ఎస్సీ కోటాలో గీతారెడ్డి, భట్టి విక్రమార్క...

మరింత సమాచారం తెలుసుకోండి: