ఇటీవల చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడం స్వాగతించాల్సిన అంశమని వ్యాఖ్యానించాడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. వాళ్ల ఇంటి వరకూ వచ్చి జగన్ పరామర్శించడం మంచి పరిణామం అని ఆయన అన్నాడు. జిల్లా వాసులు చాలా మంది భవన నిర్మాణ పనులపై ఆధారపడి ఉన్నారని, దీంతో ఇలాంటి ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్నారని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించాడు. ఇలాంటి కుటుంబాలకు స్వాంతన అందించడం మంచిదేనని, అదిజగన్ చేసినా తాము స్వాగతిస్తామని ఎంపీ అన్నాడు. మరి జగన్ మోహన్ రెడ్డి ఎవరినైనా పరామర్శిస్తాను అని అనంగానే.. తెలుగుదేశం వాళ్లు విమర్శిస్తున్నారు. మరో ఓదార్పు అంటూ జోకులేస్తున్నారు. పరిస్థితుల్లోని సీరియస్ నెస్ నైనా చూడకుండాజగన్ పై జోకులేసుకొని ఆనందిస్తున్నారు కొంతమంది. ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరమని చెప్పాలి. ఈ మధ్యకాలంలో జగన్ వరసగా ఉత్తరాంధ్రలో వరస ఓదార్పు కార్యక్రమాలను నిర్వహించాడు. తూర్పుగోదావరిజిల్లాలో గెయిల్ బాధితుల కుటుంబాలను, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించాడు. ఈ సందర్భంగా జగన్ కు ఇలాంటి ఓదార్పులు అలవాటు అయ్యాయనే వ్యంగ్యపూర్వకమైన కామెంట్లు వినిపించాయి. అయితే బాధిత కుటుంబాలకు ఇలాంటి పరామర్శలు స్వాంతనను ఇస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మాటలతో తెలుగుదేశం వాళ్లు ఆ విషయాన్ని ఒప్పుకొన్నట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: