ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని కమిటీలో కేవలం పెట్టుబడిదారులకు , ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుకు నిధులు సమకూర్చినవారికే అవకాశం ఇచ్చారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి విమర్శించారు. రాజధాని ఎక్కడో నిర్ణయం కాకముందే ఈ కమిటీ వేశారని ఆయన అన్నారు.ఇందులో అన్ని ప్రాంతాలవారికి అవకాశం ఇవ్వలేదని అన్నారు. తనకు కావల్సిన వారికే చోటు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమకు అసలు ప్రాతినిద్యం కల్పించలేదని,గతంలో శ్రీబాగ్ ఒప్పందం అమలు చేస్తామని హామీ ఇచ్చి కోస్తా,రాయలసీమలను కలిపారని, ఇప్పుడు ఆ విషయాన్ని విస్మరించి వ్యవహరించడం దారుణమని శ్రీకాంతరెడ్డి ఆరోపించారు.ముందుగానే రాజధాని నిర్ణయం చేసుకుని మొక్కుబడి వ్యవహారం నడుపుతున్నారని శ్రీకాంతరెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: