తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఈ సంస్థను పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్ర సంస్థగా మార్చా లని యోచిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్విస్ట్‌మెంట్‌ పాలసీ ప్రకారం కేంద్రం వాటాను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ సింగరేణి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మిగులు విద్యుత్‌ సాధించేయత్నంలోనూ సింగరేణిని పూర్తిస్థాయిలో ఉపయో గించుకోవాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలోని గనులకు తోడుగా విదేశాల్లో గనులు ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. వీటిపై సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా నాలుగు జిల్లాల్లో అత్యాధుని క ఆసుపత్రులు ప్రారంభించాలని, సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్లాంట్లను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సకలజనుల సమ్మెకా లాన్ని సెలవుగా పరిగణించాలని ఆదేశించారు. కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సూచించారు. సింగరేణి కాలరీస్‌పై సచివాల యంలో సుధీర్ఘంగా సమీక్షించిన కేసీఆర్‌ తన ఆలోచనలు, ఆశయాలను అధికారులతో పంచుకున్నా రు. ఈ సమీక్షా సమావేశంలో సింగరేణి సీఎండి సుతీర్థభట్టా చార్య, జెన్‌కో సీఎండి దేవులపల్లి ప్రభాకరరావు, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, సింగరేణి డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) రమేష్‌కుమార్‌, యూనియన్‌ లీడర్‌ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ రమేష్‌కుమార్‌ సంస్థపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందులో బొగ్గు నిల్వలు, ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌, గ్రౌండ్‌వాటర్‌ మైనింగ్‌, ఎయిర్‌ కండిషనింగ్‌, లీవులు, సెలవులు, సంస్థ నిర్వహణపై కూలం కుషం గా వివరించారు. త్వరలో సింగరేణిలో పర్యటిస్తానని, ఒకటి, రెండు భూగర్భ గనులను ప్రారంభిస్తానని, ఇందు కోసం గనులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.12,300 కోట్ల రూపాయల టర్నోవర్‌ కాగా ఇందులో కేంద్రానికి రూ.1,200 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,500 నుంచి 1,600కోట్ల వరకు రాయల్టిd రూపంలో ప్రతి ఏటా చెల్లిస్తున్నామని సీఎండి సుతీర్థభట్టాచార్య వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: