ట్యాంక్‌ బండ్‌పై పనికిరాని విగ్రహాలు చాలా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. మంగళవారం రవీంద్ర భారతిలో దాశరథి కృష్ణామాచార్య 89వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చిన కవిత్వం దాశరథిది అని కొనియాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న తెలంగాణ బిడ్డ దాశరథి జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని కేసీఆర్ అన్నారు.  ట్యాంక్ బండ్‌పై పనికి రాని విగ్రహాలు చాలా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ఎవరికీ తెలియని బళ్లారి రాఘవ వంటి వారి విగ్రహం కూడా ట్యాంక్‌బండ్‌పైన ఉందని ఆయన అన్నారు. దాశరథి వంటి మహానుభావుల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాశరథి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, దాశరథి పేరుతో స్మారక అవార్డును ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఓ విద్యాసంస్థకు దాశరథి పేరు పెడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: