ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇరుకున పెడుతున్నారా అంటే అవుననే అంటున్నారు. గత ఎన్నికలలో టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేసిన పవన్ నేరుగా బాబును ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు అయితే ఎన్డియే,టీడీపీకి తన మద్దతు తెలిపి వారి తరుపున ప్రచారం చేసి మొత్తానికి గెలుపులో తనవంతు కృషి చేశాడు. పవన్ వల్లనే టీడీపీ గెలిచిందని పార్టీ నుంచి ఈ మాటలు వెలువడుతుంటే తెలుగు తమ్ముళ్లకు మాత్రం రుచించడం లేదట. ఇప్పుడు అదే వైసిపి పార్టీకి అస్త్రత్రంలా ఉపయోగపడుతుందంటున్నారు. చంద్రబాబు తప్పుడు హామీలు మోడీ, పవన్ కళ్యాణ్ ల హవా వల్లనే టీడీపీ గెలిచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా నగరి ఎమ్మెల్యే, వైసిపి పార్టీ మహిళా నేత రోజా మంగళవారం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందన్నారు. ఇలా సొంత పార్టీ, మిత్ర పక్షం బీజేపీ, విపక్షం పార్టీ కూడా పదే పదే పవన్ నామ జపం చేయడం తెలుగు తమ్ముళ్లకు ససేమిరా నచ్చడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: