వ్యవసాయాన్ని సంక్షోభంలో నుంచి రక్షించడానికి రుణమాఫీ పధకాలు మంచిది కాదని నాబార్డు మాజీ ఛైర్మన్ ,ప్రస్తుతం ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుణమాఫీ కమిటీ చైర్మన్ కోటయ్య వ్యాఖ్యానించారు.వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి ఇతర మార్గాలు ఎంచుకోవాలని అబిప్రాయపడింది. అయితే ఆంద్ర్రప్రదేశ్ ప్రభుత్వ పంటరుణాలు 30 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, బ్యాంకులు రీషెడ్యూల్ కు అవకాశం ఇస్తే ఏటా ఎనిమిదివేల కోట్లు వనరులు సేకరించడం కష్టం కాదని ఆయన అన్నారు. రుణాల రీషెడ్యూల్ కు, రుణమాఫీకి రిజర్వు బ్యాంకు సంబంధం పెట్టరాదని, రీషెడ్యూల్ కు అనుమతి ఇవ్వాల్సిందని అన్నారు.అయితే ఆర్బిఐ ఎలాంటి వెసులుబాటు కల్పించలేదని అన్నారు. కేంద్రాన్ని తాము ఈ విషయంలో సాయం అడగలేదని అన్నారు.కార్పొరేషన్ల పేరుతోనే అప్పులు చేయవలసి ఉంటుందని ,అప్పుడు చట్టం ,కాని ఆర్బిఐ కాని అడ్డుకోలేవని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: