సానియా మీర్జా... టెన్నిస్ క్రీడాకారిణిగా దేశంలోని క్రీడాభిమానులకు చిర పరిచితమైన పేరు. ఆట కంటే అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాధించుకుంది ఈ హైదరాబాదీ సుందరి. సింగిల్స్ లో ఎక్కువగా సత్తా చాటలేకపోయినా... డబుల్స్ లో మాత్రం అప్పుడప్పుడూ విజయ పతాకాన్ని రెపరెపలాడించింది. పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడైన షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సానియా... హైదరాబాద్ స్థానికురాలిగా గుర్తింపు పొందింది. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది సానియా మీర్జా. దీంతో ఇప్పుడు ఆమె స్థానికత పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. 1956 కు ముందు నుంచీ తెలంగాణలో ఉన్న వాళ్ల పిల్లలకే స్కాలర్ షిప్ లు అని తేల్చి చెప్పింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే సానియా కుటుంబీకులు కూడా 1956 కు ముందు పాకిస్థాన్ లో నివసించే వారని ఫేస్ బుక్ మిత్రులు చెవులు కొరుక్కుంటున్నారు. అలాంటి సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం ఏమిటనే ప్రశ్నలు కూడా జోరుగా పోస్ట్ అవుతున్నాయి. పలు కంపెనీల ప్రకటనలు చేసి కోట్లాది రూపాయలు సంపాధించిన సానియాకు కోటి రూపాయలు సాయం చేయడం పైనా విమర్శలు వినిపిస్తున్నాయి. సానియా ఏనాడూ తెలంగాణ మాట కూడా ఎత్తలేదని, కనీసం ఆమె భాష, యాస కూడా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఉండవని... అలాంటి వ్యక్తిని ప్రచారకర్తగా నియమించడం సరికాదనే భావన వ్యక్తమవుతోంది. తెలంగాణ భాష, యాస, కట్టు, బొట్టును ప్రచారం చేసిన వారిని, చేయగలిగే వారిని ప్రచారకర్తగా నియమించాలన్నది సోషల్ మీడియా మిత్రులు టీజీ ప్రభుత్వానికి చేస్తున్న సూచన. ఆటలో సానియా మీర్జా కంటే ఎక్కువే సాధించిన సైనా నెహ్వాల్, ఇటీవలే ఎవరెస్టును అధిరోహించిన గిరిజన బాలిక పూర్ణ, రాష్ట్ర సాధన పోరులో గళమెత్తి పాడిన ఎందరో గాయకులు ఉన్నారనే సంగతిని గుర్తు చేస్తున్నాయి ఫేస్ బుక్ పోస్టులు. ఇప్పటికే అధికారికంగా సానియాకు నియామక పత్రంతో పాటు కోటి రూపాయల చెక్కును కూడా అందజేసిన కేసీఆర్... ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అన్నది అనుమానమే. కానీ పక్క రాష్ట్ర తెలుగు విద్యార్థులకు పైసా ఫీజు కూడా చెల్లించమని చెప్తున్న టీఆర్ఎస్ సర్కార్... పాకిస్థానీ మూలాలున్న సానియాకు మాత్రం కోటి రూపాయలు, అంతకు మించి గౌరవాన్ని కట్టబెట్టడం పై ఏం సమాధానం చెప్తుందో మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: