ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్ లో తమకు మహారాష్ట్ర వంటకాలు వండిపెట్టలేదన్న కారణంతో ఆగ్రహానికి గురైన 11 మంది ఎంపీలు ముస్లిం మతస్థుడైన కేటరింగ్ సూపర్‑వైజర్ తో బలవంతంగా చపాతి తినిపించారు. అతడి రంజాన్ ఉపవాస దీక్షను భగ్నం చేశారు. ఈ వీడియో వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. శివసేన ఎంపీల ఈ నిర్వాకం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. ఈ ఉదయం లోక్‑సభ ప్రారంభంకాగానే పలువురు విపక్ష ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. మత స్వేచ్ఛను శివసేన ఎంపీలు కాలరాశారని విమర్శించారు. వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ సమిత్రా మహాజన్ సర్దిచెప్పినా వారు వెనక్కు తగ్గలేదు. అటు రాజ్యసభ కూడా చపాతి ఘటనపై అట్టుడికింది.

మరింత సమాచారం తెలుసుకోండి: