ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీ చేయటం పట్ల రాష్ట్రంలోని రైతులంతా పండుగ చేసుకుంటుంటే, అది చూసి ఓర్వలేక వైఎస్‌ జగన్‌ విమర్శలు చేయటం అమా నుషమని, జగన్‌ ఇప్పటికైనా పిల్లచేష్టలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హెచ్చంచారు. దేశంలో ఇప్పటివ రకు ఏ ప్రతిపక్ష నేత చేయని విధంగా, జగన్‌ చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేయమని తన కార్యకర్తలను ఉసిగొలుపుతున్నాడని ఆయన మండిపడ్డారు. బుధవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావే శంలో మంత్రి బొజ్జల మాట్లాడుతూ రాష్ట్రం 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో ఉన్నా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే ఇంతవ రకు ఎవరూ చేయని, ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోని, 45 వేల కోట్ల రూ పాయల రైతుల రుణాలను మాఫీ చేసి, రైతు బాంధవుడిగా చంద్రబాబు రైతుల హృదయాలలో నిలిచిపోయాడని కొనియాడారు. రాష్ట్రంలో 96.05శాతం మం ది రైతులకు రుణమాఫీ చేసి రైతులకు అండగా చంద్రబాబు నిలిచారని బొజ్జల తెలిపారు. రైతు రుణమాఫీ చేసినందుకు రాష్ట్రంలోని రైతులతో పాటు, రాజకీ యాలకు అతీతంగా అన్ని పార్టీలవారు హర్షం వ్యక్త చేస్తున్నారని బొజ్జల తెలిపా రు. కాని రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న వైఎస్‌ జగన్‌ మాత్రం రైతు రు ణాలు మాఫీ చేయటం జీర్ణించుకోలేక పోతున్నాడని విమర్శించారు. అడివిలో చెట్లు, ఇసుక తాకట్టు పెట్టి రుణమాఫీ చేస్తారా అని జగన్‌ అంటున్నాడని, అడు వులైనా, ఇసుకైనా అది ప్రభుత్వ సోమ్మని, దాన్ని ప్రజలకు ఖర్చుచేసే అధికారం ప్రభుత్వాలకు ఉందన్నారు. జగన్‌లాగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజ ల ఆస్తులను దోచుకొని స్వంతానికి దాచేకోవటంలేదని బొజ్జల విమర్శించారు. జగన్‌ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌ ఎం దుకు జైలుకు వెళ్ళాడో, ఎందుకు బైటకు వచ్చాడో, 16 నెలలు జైల్లో ఎందుకు ఉన్నాడో ఎప్పుడైనా ప్రజలకు వివరించాడా అని మంత్రి బొజ్జల జగన్‌ను ప్ర శ్నించారు. ఒక వేళ జగన్‌పై తప్పు డు కేసులు పెడితే ఆ విష యానై్ననా ప్రజల కు ఎందుకు తెలియచేయలేదన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లంతా జగన్‌ అనుచ రులేనని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వమే ఎర్రచందనం చెట్ల ను నరికి అమ్మి, వాటిద్వారా వచ్చి న ఆదాయాన్ని ప్రజల అభి వృద్ది ఖర్చు పెడ దామని చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. అయితే ఎర్రచందన మంతా ప్రభు త్వం ప్రజలకోసం ఉపయోగిస్తే, మాస్మగ్లర్లు ఎలా బతకాలి, ఎలా స్మగ్లింగ్‌ చేయాలని జగన్‌కు దిగులు పట్టుకుందని మంత్రి గోపాల కృష్ణారెడ్డి తెలిపారు. అందుకే ఎర్రచందనం చెట్లు ప్రభుత్వం నరకవద్దని చెపు తున్నాడన్నారు. జగ న్‌మీద సీబీఐ, ఈడి లెక్కలేనన్ని సెక్షన్‌ల క్రింద, లెక్కలేనన్ని కేసులు నమాదు చేసిందని అందుకే జగన్‌ దొంగలాగా బ్రతుకుతున్నాడని విమర్శించారు. ఎప్పు డు జైలుకు వెళతాడో తెలియని అయోమయంలో జగన్‌ ఉన్నాడని బొజ్జల ఎద్దే వా చేశారు. జగన్‌ బ్రతుకు ప్రజలందరికి తెలుసునని, ప్రజాభి మానం చూర గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బాబును విమర్శిస్తే రాష్ట్రంలోని రైతులే తగిన విధంగా బుద్ది చెపుతారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జగన్‌ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: