పిల్లలు చక్కగా చదువుకొని వారి బంగారు జీవితాలకు బాట వేసుకోవాలని అనుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలపై ఏన్నో ఆశలు పెట్టు కొని ప్రవేట్ స్కూల్లో చేర్పించి వారి భవిష్యత్ గురించి ఎన్నో కలలు కంటారు. కాని వారి అశలు ఆవిరైపోయాయి మెదక్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదంలో వారి తల్లిదండ్రులకు విషాద ఛాయలు నింపాయి. విషయానికి వస్తే... మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయి పేట వద్ద ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు నాందేల్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనలో 26 మంది విద్యారు దుర్మరణం పాలయ్యారు. కాకతీయ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొంది అంతే బస్సులో ఉన్న 30 విద్యార్థుల్లో 26 మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని సహాయ చర్యలు చేప్పటారు. గాయపడి విద్యార్థులను సమీప ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ కాపలాదారు ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదాన్ని గమనించలేక పోయారని తెలుస్తుంది. గతంలో కూడా ఈ క్రాసింగ్ వద్ద అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడ సరైన కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: